టీమిండియా మాజీ క్రికెటర్ మహేంద్రసింగ్ ధోనీకి ఏ రేంజ్ లో క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. భారత జట్టుకు ఏకంగా రెండు వరల్డ్ కప్ లు అందించిన కెప్టెన్ గా ధోని ఇక భారత క్రికెట్ హిస్టరీ అనే పుస్తకంలో ప్రత్యేకమైన పేజీలు లికించుకున్నాడు. ఈ క్రమంలోనే ఇప్పటివరకు ధోని రికార్డును ఏ కెప్టెన్ కూడా బ్రేక్ చేయలేదు అని చెప్పాలి. ఇలా వరల్డ్ లోనే బెస్ట్ కెప్టెన్ గా గుర్తింపును సంపాదించుకున్న ధోని.. బెస్ట్ వికెట్ కీపర్ గా బెస్ట్ ఫినిషర్ గా కూడా ప్రేక్షకుల గుండెల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు.


 ఇక ఎంత వత్తిడిలో అయినా కూడా నవ్వుతూనే ప్రత్యర్ధులను భయపెట్టే మహేంద్రసింగ్ ధోని.. సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ ని సంపాదించుకున్నాడు అని చెప్పాలి. అయితే ధోని పెద్దగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండడు. కానీ ధోని కి సంబంధించిన వార్త మాత్రం ఎప్పుడు ఏదో ఒకటి ఇంటర్నెట్లో వైరల్ గా మారిపోతూనే ఉంటుంది. ఈ క్రమంలోనే ఇక మహేంద్రుడి గురించి ఏదైనా సోషల్ మీడియాలోకి వచ్చింది అంటే చాలు ఆ విషయం గురించి తెలుసుకునేందుకు అభిమానులు తెగ ఆసక్తిని కనపరుస్తూ ఉంటారు. కాగా ఇప్పుడు ధోని తన ఫ్రెండును కలిసిన ఒక విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది.


 అదేంటి ధోని స్నేహితులను ఎప్పుడు కలుస్తూనే ఉంటాడు కదా.. కొత్తగా మాట్లాడుకోవడానికి ఏముంది అనుకున్నారు కదా.. ఆ ఫ్రెండ్ అలాంటి ఇలాంటి ఫ్రెండ్ కాదు ఎంతో స్పెషల్. దాదాపు 12 ఏళ్ల తర్వాత కలుస్తాడు. 2007 t20 వరల్డ్ కప్ అందించడంలో అప్పటి కెప్టెన్ ధోని ఆఖరి ఓవర్ బౌలింగ్ వేసిన జోగేందర్ శర్మ కీలక పాత్ర వహించాడు. తాముద్దరం ఇటీవల కలిసామని జోగేందర్ శర్మ తన ఇంస్టాగ్రామ్ లో తెలిపారు. చాలా కాలం తర్వాత నిన్ను కలవడం సంతోషంగా ఉంది మహి. సుమారు 12 ఏళ్ల తర్వాత మీట్ కావడం చాలా విచిత్రంగా ఉంది అనే క్యాప్షన్ను సోషల్ మీడియాలో జోడించారు జోగేందర్ శర్మ. ఇక ధోనిని ఆలింగనం చేసుకున్న ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇది కాస్త వైరల్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: