పారిస్ ఒలంపిక్స్ లో ఇండియాకు ఊహించని షాక్ తగిలింది. కచ్చితంగా మరొక పతకం వస్తుందని   అందరూ అనుకున్న నేపథ్యంలోనే ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. దీంతో ఇండియన్స్ హృదయం ముక్కలైంది. 50 కేజీల రెజ్లింగ్ పోటీలలో... నిన్ననే వినేష్ ఫోగట్  ఫైనల్స్ కు దూసుకు వెళ్లడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే... ఆమె పైన వెయిట్ వేశారు ఒలంపిక్స్  అధికారులు.

 100 గ్రాముల అధిక బరువు  ఎక్కువగా వినేష్  పొగట్ ఉన్నారని... పారిస్ ఒలంపిక్స్ అధికారులు ఆమెపై వెయిట్ వేశారు. అంటే ఈ లెక్కన... వినేష్ ఫోగట్  గోల్డ్ మెడల్  పొందే అర్హత ఉండదన్నమాట. వాస్తవంగా మంగళవారం రోజున మూడు బౌట్ లలో..  విజయం సాధించింది వినేష్ ఫోగట్. ఈ తరుణంలోనే ఫైనల్ కు దూసుకు వెళ్లిన..వినేష్ ఫోగట్... ఎలాగైనా గోల్డ్ సాధిస్తుందని అందరూ అనుకున్నారు.

 కానీ కథ మొత్తం అడ్డం తిరిగింది.వినేష్ ఫోగట్ ను విధి వెక్కిరించింది. అయితే...వినేష్ ఫోగట్ పై అనర్హత వేటుపడడం పైన... సంచలన ఆరోపణలు తెరపైకి వస్తున్నాయి. కుట్ర చేసి మరి...వినేష్ ఫోగట్ పైన వేటు వేశారని... దీని వెనుక బిజెపి కుట్రలు ఉన్నాయని కొంతమంది ప్రచారం చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ పార్లమెంటు సభ్యులు బ్రిజ్ భూషణ్  కు వ్యతిరేకంగా వినేష్ ఫోగట్ చాలా రోజులు ధర్నా చేశారు. తనను లైంగికంగా వేధించారని... బిజెపి ఎంపీ కి వ్యతిరేకంగా ఢిల్లీలో కూడా ధర్నా చేసింది  వినేష్ ఫోగట్.


ఇక ఈ ధర్నాకు... దేశం తోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా మంచి స్పందన కూడా వచ్చింది. అయితే ఇలాంటి నేపథ్యంలోనే ప్యారిస్ ఒలంపిక్స్ లో...వినేష్ ఫోగట్ ఫైనల్ కు చేరడంతో బిజెపి.. కొత్త కుట్రల కు దారితీసింది అని విమర్శలు వస్తున్నాయి. ఆమె ఫైనల్ లో గోల్డ్ గెలిస్తే బిజెపికి... చెడ్డ పేరు వస్తుందని... కావాలనే  వినేష్ ఫోగట్... ఫైనల్ ఆడకుండా కుట్రలు చేశారని... జోరుగా చర్చ జరుగుతోంది. బిజెపి దోషిగా ఉండకూడదని... టోర్నీ నుంచి వినేష్ ఫోగట్  వైదొలిగేలా చేశారని....నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. మరి దీనిపైన ఎంత మేరకు వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: