ఈ క్రమంలోనే ఇక ఎన్నో విషయాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ ఉండటం గమనార్హం. అయితే ఈ మధ్యకాలంలో సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఎప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతున్న వారిలో మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ తండ్రి యోగు రాజ్ సింగ్ కూడా ఉన్నారు అన్న విషయం తెలిసిందే. గతంలో మహేంద్ర సింగ్ ధోనీని ఉద్దేశిస్తూ ఈయన చేసిన కామెంట్స్ ఎంత సంచలనంగా మారిపోయాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ధోని కారణంగానే తన కొడుకు యువరాజ్ కెరియర్ పాడైందని.. ఇక ఈ విషయంలో ధోని ని ఎప్పటికీ క్షమించను అంటూ యువరాజ్ తండ్రి యోగ్ రాజు వ్యాఖ్యానించాడు. అయితే తన తండ్రి పిచ్చోడు అంటూ తర్వాత యువరాజ్ చేసిన కామెంట్స్ కూడా ఇలాగే సంచలనంగా మారాయ్.
ఇక ఇప్పుడు మరోసారి ఇలాంటి సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు యోగ్ రాజు సింగ్. తన వద్ద కోచింగ్ లో చేరాలి అంటే చావు పై భయం వదిలేయాలని మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ తండ్రి యోగ్ రాజ్ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. మా నాన్న నన్ను చావు భయం లేకుండా పెంచారు. పులి వేటకు నన్ను తీసుకువెళ్లారు. పులిని చంపి దానిపై నన్ను కూర్చోబెట్టారు. అంతేకాదు దాని రక్తాన్ని నా మొహానికి కూడా పూశారు. పులి ఎప్పుడు గడ్డి తినదు అంటూ ఆయన చెప్పిన మాటలు ఎప్పటికీ మర్చిపోలేను. అందుకే నా కొడుకును భయం అంటే ఏంటో తెలియకుండా పెంచా అంటూ యోగ్రాజ్ సింగ్ చెప్పుకొచ్చాడు.