ఈ క్రమంలోనే కొంతమంది వీడియో ఎడిటింగ్ లో ఉన్న తమ నైపుణ్యాన్ని చూపిస్తూ ప్రతి ఒక్కరిని అవాక్కయ్యేలా చేస్తూ ఉన్నారు. దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన కొన్ని ఘటనలపై తమ క్రియేటివిటీని చూపించి నెటిజెన్స్ అందరిని కూడా అవాక్కయ్యేలా చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇలాంటి వీడియోనే ఒకటి వైరల్ గా మారిపోయింది. ప్రస్తుతం భారత జట్టు బంగ్లాదేశ్ తో టెస్ట్ సిరీస్ ఆడుతుంది ఈ క్రమంలోనే తొలి టెస్ట్ మ్యాచ్లో స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్లు అందరూ విఫలమైన సమయంలో సీనియర్ బౌలర్ అయిన అశ్విన్ సెంచరీ తో చలరేగిపోయాడు. టీమిండియా తక్కువ స్కోరుకే ఆల్ అవుట్ అవుతుంది అనుకుంటున్నా సమయంలో.. అశ్విన్ చేసిన సెంచరీ భారత జట్టును మంచి పొజిషన్లో నిలపగలిగింది.
ఈ క్రమంలో టీమిండియా కష్టాల్లో ఉన్న ప్రతిసారి కూడా అశ్విన్ ఇలా తన బ్యాట్ తో కూడా ఆకట్టుకుంటూ ఇక అందరి చేత ప్రశంసలు అందుకుంటూ ఉంటాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే బంగ్లాతో టెస్టులో సెంచరీ తో కదం తొక్కిన రవిచంద్రన్ ను బాహుబలి తో పోలుస్తూ ఎడిట్ చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బాహుబలి సినిమాలో ప్రభాస్ ఏకంగా శివలింగాన్ని ఎత్తుకునే సాంగ్ ఎంత వైరల్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఇప్పుడు ఎడిట్ చేసిన వీడియోలో శివలింగమే టీం ఇండియా గా మారింది. ఇక ప్రభాస్ స్థానంలో అశ్విన్ తల్లిగా కోచ్ గౌతమ్ గంభీర్ , తండ్రిగా కోహ్లీని పెట్టారు. తనికెళ్ల భరణి ప్లేస్ లో కెప్టెన్ రోహిత్ శర్మ, గ్రామస్తుల ముఖాలకు పంత్, కేఎల్ రాహుల్, జడేజా ఫేస్ లను పెట్టి ఎడిట్ చేశారు. ఈ వీడియోని సోషల్ మీడియాలోకి వదలడంతో క్రికెట్ ఫ్యాన్స్ అందరికీ కూడా ఇది తెగ నచ్చేస్తుంది.