ప్రపంచ కప్ లో నిన్న ఓ మహాసంగ్రామం జరిగింది.  వరల్డ్ కప్ మ్యాచ్ లు చూసేందుకు సగటు క్రికెట్ అభిమాని సైతం ఆసక్తిని చూపిస్తుంటారు.  అయితే, ఇండియా మ్యాచ్ లు ఉంటె...ఇంక చెప్పాల్సిన అవసరం లేదు. అదే దాయాదుల పోరైతే.. చెప్పడానికి వీలులేదు.  ఇండియా పాక్ మ్యాచ్ ఉన్నరోజున రోడ్లన్నీ బోసిపోతాయి.  నిత్యం కిక్కిరిసి ఉండే రోడ్లపై ఆరోజున జనాలు కనిపించరు. 

అందరు టీవీలకు అతుక్కుపోతారు. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఓ యుద్ధంలా భావిస్తారు.  మనమే గెలవాలి అని అందరు టివిల ముందు కూర్చుంటారు.  ప్రార్ధనలు చేస్తుంటారు.  నిన్నటి రోజున అదే జరిగింది.  ఇంగ్లాండ్ లో జరుగుతన్న చాలా మ్యాచ్ లు వర్షం కారణంగా ఆగిపోయినా.. నిన్నటి మ్యాచ్ పై వరణుడు సైతం కరుణించాడు.  అప్పుడప్పుడు అలా రెండు చినుకులు కురిసి ఆగిపోయింది.  


పాక్ టాస్ గెలిచి ఇండియాకు బ్యాటింగ్ అప్పగించింది.  ఇదే పాక్ చేసిన తప్పు.  అసలే వాతావరణం జాగాలేదు.  ఎప్పుడు వర్షం పడుతుందో చెప్పలేని పరిస్థితి.  అలాంటప్పుడు మొదట బ్యాటింగ్ చేసిన జట్టు ధీటుగా ఆడితే.... మ్యాచ్ పై విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయి.  ఇది ఆలోచించకుండా పాకిస్తాన్ ఫీల్డింగ్ ఎంచుకుంది.  పైగా ఫీల్డింగ్ లోపాల కారణంగా అనేక రన్స్ ను ఇచ్చుకోవాల్సి వచ్చింది.  


తనదైన రోజున చెలరేగి ఆడతాడు అన్నట్టుగా, రోహిత్.. మెరుపులు మెరిపించి శతకం బాదాడు.  మరోవైపు రాహుల్, కోహ్లీలు అర్ధ సెంచరీ లు చేయడంతో 336 పరుగులు చేసింది.  అప్పటికే ఒకసారి వర్షం కారణంగా మ్యాచ్ కు అంతరాయం కలిగింది. దీంతో మ్యాచ్ ను 40 ఓవర్లకు కుదించి.. 302 టార్గెట్ ను ఫిక్స్ చేశారు.  


ఇది చాలా కష్టమైన స్కోర్.  అప్పటికే పాక్ మానసికంగా ఓటమిని అంగీకరించింది.  మ్యాచ్ ఆడాలి కాబట్టి ఆడిందా అనిపించే విధంగా ఆడింది.  ఇన్నింగ్స్ ఛేదనలో పాక్ 35 ఓవర్లకు ఐదు వికెట్ల నష్టానికి కేవలం 166 పరుగులు చేసింది.  ఆ సమయంలో మళ్ళీ వాన కురవడంతో ఇండియాను విజేతగా ప్రకటించారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: