ఐసీసీ ప్రపంచకప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీం ఇండియా వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ రికార్డుల మీద రికార్డులు బ‌ద్ద‌లు కొట్టాడు. ఈ మ్యాచ్‌లో సెంచరీ సాధించిన రోహిత్ ప్రపంచకప్‌లో అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాళ్ల జాబితాలో చోటు దక్కించుకున్నాడు. స‌చిన్ ప్ర‌పంచ‌క‌ప్‌లో మొత్తం 6 సెంచ‌రీలు చేస్తే... రోహిత్ 5 సెంచ‌రీలు చేశాడు. 


ఇక వ‌న్డేల్లో అత్య‌ధిక సిక్స్‌లు కొట్టిన భార‌త ఆట‌గాడిగా నిలిచాడు. రోహిత్ 230 సిక్స్‌లు కొడితే ధోనీ 228 సిక్స్‌లు కొట్టాడు. ఒకే ప్ర‌పంచ‌క‌ప్‌లో నాలుగు సెంచ‌రీలు చేసిన రోహిత్‌, శ్రీలంక ఆట‌గాడు కుమార సంగ‌క్క‌ర స‌ర‌స‌న నిలిచాడు. సంగ‌క్క‌ర గ‌త ప్ర‌పంచ‌క‌ప్‌లో నాలుగు సెంచ‌రీలు చేసిన సంగ‌తి తెలిసిందే.


ఇక బంగ్లాపై సెంచ‌రీతో రోహిత్ ఈ ప్ర‌పంచ‌క‌ప్‌లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన ఆట‌గాడిగా నిలిచాడు. రోహిత్ మొత్తం నాలుగు సెంచ‌రీల‌తో 544 ప‌రుగుల చేశాడు. ఇక ఈ ప్ర‌పంచ‌క‌ప్‌లో భార‌త్‌కు అత్య‌ధిక ఓపెనింగ్ భాగ‌స్వామ్యం 180 న‌మోదు అయ్యింది. ఏదేమైనా ప్ర‌పంచ‌క‌ప్‌లో రికార్డుల మీద రికార్డులు బ‌ద్ద‌లు కొడుతోన్న రోహిత్ ఎన్నో సంచ‌ల‌నాలు న‌మోదు చేస్తున్నాడు.



మరింత సమాచారం తెలుసుకోండి: