ప్రపంచ నెంబర్ వన్ బ్యాట్స్‌మెన్ ఎవరు ? అంటే ఇప్పుడు ఈ రేసులో టీమిండియా క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ కొనసాగుతున్నాడు. అయితే ఇప్పుడు కోహ్లీ ప్లేస్ కు వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ నుంచి గట్టి సవాల్ ఎదురవుతోంది. కెరీర్ లోనే ఉన్న తిరుగులేని బీకర‌ ఫామ్లో ఉన్న రోహిత్ శర్మ ప్రపంచ కప్ లో ఏకంగా ఐదు సెంచరీలతో చెలరేగిన పోతున్నాడు. ప్రపంచంలోనే టాప్ బ్యాట్స్ మెన్స్ ర్యాంకులను తాజాగా ఐసీసీ రిలీజ్ చేసింది. 


రోహిత్ అప్పుడే రెండో స్థానానికి చేరుకున్నాడు. ఇప్పుడు రోహిత్ విరాట్ మధ్య కేవలం 6 పాయింట్ల తేడా మాత్రమే ఉంది. తాజాగా ఐసీసీ విడుదల చేసిన జాబితాలో రోహిత్ రెండో స్థానానికి దూసుకురావడంతో కోహ్లీ స్థానానికి ఎర్త్ పెట్టేస్తున్నాడు అన్న చర్చ మొదలయింది. రోహిత్ ఐదు సెంచరీలు.. ఒక హాఫ్ సెంచ‌రీతో ప్రపంచకప్‌లో ఇప్పటికే 647 పరుగులు సాధించి సచిన్ టెండూల్కర్ క్రియేట్ చేసిన 673 ప‌రుగుల రికార్డు బ్రేక్ చేసేందుకు రెడీగా ఉన్నాడు.


ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో రోహిత్‌ను బీట్ చేయ‌డం కోహ్లీకి సాధ్యం అవుతుందా ? అన్న‌ది కూడా డౌటే. ఓపెనర్‌గా రావ‌డం రోహిత్‌కు ప్ల‌స్‌. పైగా మ‌రో ఓపెనర్ రాహుల్ కూడా స్టాండింగ్‌గా ఆడుతుండ‌డంతో తొలి ప‌వ‌ర్ ప్లేలో భారీగా వీళ్లు ప‌రుగులు రాబ‌ట్టుకుంటున్నారు. మ‌రో వైపు కెప్టెన్‌గా కోహ్లీకి ఒత్తిళ్లు ఎక్కువుగా ఉన్నాయి. ఈ క్ర‌మంలోనే రోహిత్ త్వ‌ర‌లోనే కోహ్లీ ప్లేస్‌కు ఎర్త్ పెట్ట‌డం ఖాయంగా ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: