క్రికెట్ చరిత్రలోనే 2019 ప్రపంచ కప్ సిరీస్ షెడ్యూల్ పరమ చెత్త షెడ్యూల్ అని ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డ్ ని విమర్శిస్తున్నారు క్రికెట్ అభిమానులు, ఒక్కరోజులో పూర్తి కావాల్సిన భారత్-న్యూజిలాండ్ మ్యాచ్ వర్షం కారణంగా రెండు రోజులు పట్టింది.
పొడి పిచ్ పై బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ అతికష్టం మీద 46.1 ఓవర్లలో 5వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. రెండవ రోజు ఆట ముగిసే సమయానికి 239 పరుగులు చేసింది.
అయితే వర్షము కారణంగా పిచ్ తడిగా మారింది, ఇండియన్ ఆటగాళ్లు బ్యాటింగ్ కి దిగి ఎంత బాదిన బంతి కదలనని మొరాయించింది. ఫలితంగా మన వికెట్లు కోల్పోవడం జరిగింది. వర్షం కురిసినప్పుడు పిచ్ ని పట్టాలతో పూర్తిగా కప్పలేదని,
ఇది కేవలం ఇంగ్లాండ్ బోర్డ్ నిర్లక్ష్యం అని క్రికెట్ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కేవలం ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డ్ నే కాదు,ఇండియన్ టీమ్ కెప్టెన్ విరాట్ కోహ్లీ ని కూడా విమర్శిస్తున్నారు క్రికెట్ పెద్దలు, ధోని లాంటి బ్యాట్స్ మెన్ ను 7వ స్థానం లో దింపడం ఏంటని ఇది కేవలం విరాట్ కోహ్లీ తెలివి తక్కువ వ్యూహమని ఆరోపిస్తున్నారు.
ధోని రన్ ఔట్ అయిన క్షణం ఇప్పటికి క్రికెట్ అభిమానులకు షాక్ గానే ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: