భారత్ దేశంలో క్రికెట్ కు ఉన్న ప్రత్యేకత మరే ఏ ఇతర ఆటకు లేదు. అలాంటి భారత్ క్రికెట్ కు ప్రసుత్తం వరుస షాక్ లు మీద షాక్ లు తగులుతున్నాయి. ఈ మధ్యకాలం లోనే మరో సచిన్ అని దిగ్గజాల చేత ప్రశంసలు పొందిన యువ క్రికెటర్ పృథ్వీ షా డోపింగ్ టెస్టులో పాజిటివ్ అని తేలడంతో అతని పై బీసీసీఐ ఎనిమిది నెలల సస్పెన్షన్ ను విధించింది. సీనియర్ భారత్ ప్లేయర్ సన్నీ మరియు సెలెక్టర్ ఎం. ఎస్. కే ప్రసాద్ కు ఈ మధ్య జరిగిన కోల్డ్ వార్ పెద్ద చర్చనీయాంశం అయ్యింది.దానిని మరవకముందే భారత్ క్రికెట్ ను మరో వివాదం వెంటాడుతుంది.

వెస్టిండీస్ సీరీస్ లో భారత్ ఏ జట్టు తరుపున అద్భుతంగా బ్యాటింగ్ లో రాణించిన యువ క్రికెటర్ గిల్ కు ఛాన్స్ దొరుకుతుంది అని అందరూ భావించారు.కాని  భరత్ ,వెస్టిండీస్ తో జరిగే సీరీస్ లో అతనికి చోటు దక్కలేదు.అతనికి బదులుగా 36 ఏళ్ల కేదార్ జాదవ్ కు టీమ్ లో చోటు కల్పించారు. ఈ విషయం పై చాలా మంది సీనియర్లు యువ క్రికెటర్ కు చోటు కలిపించకపోవడం పై తమదైన శైలిలో ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

తనని పట్టించుకోని బీసీసీఐ సెలక్టర్స్ కు గిల్ తన బ్యాట్ తో కౌంటర్ ఇచ్చాడు.గతంలో గంభీర్ పేరున ఉన్న రికార్డ్ ను తన పై నమోదు చేసుకొని తను ఇంటర్నేషనల్ లెవెల్ కు సిద్ధం అని ప్రూవ్ చేశాడు.వెస్టిండీస్ ఏ జట్టు తో జరుగుతున్న మూడవ అనధికారిక టెస్ట్ మ్యాచ్ లో డబుల్ సెంచరీ కొట్టిన అతి చిన్న వయసు కలిగిన క్రికెటర్ గా రికార్డును నమోదు చేసుకున్నాడు.

అసలే భారత్ సెలక్షన్ కమిటీ బాగా వ్యవహరించట్లేదని కామెంట్స్ వస్తున్న నేపధ్యంలో ఇలా జరగడం సెలక్షన్ కమిటీ కి మింగుడు పడని విషయం గా తయారయ్యింది.


మరింత సమాచారం తెలుసుకోండి: