టీమిండియా పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ మరో అరుదైన రికార్డు సాధించాడు. విండీస్‌ టూర్‌లో వరుస సెంచరీలతో ఓ అరుదైన రికార్డును బ్రేక్ చేశాడు. రోజుకో రికార్డుతో అభిమానుల మనసు దోచుకుంటున్నాడు విరాట్ కోహ్లీ. విండీస్‌ టూర్‌లో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఈ నెల 11న జరిగిన రెండో వన్డేలో 120 పరుగులు చేసిన కోహ్లీ బుధవారం జరిగిన మూడో వన్డేలో 114 పరుగులు చేశాడు. 


2017లో విండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో సెంచరీ బాదిన కోహ్లీ.. తాజాగా వరుసగా రెండు సెంచరీలు నమోదు చేశాడు. కాగా ఈరోజు జరిగిన వన్డేలో 99 బంతుల్లో 114 పరుగులు చేసి టీమిండియా విజయంలో కీలక పాత్రపోషించగా, ఈ ఇన్నింగ్స్‌తో ఇప్పటి వరకు ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్‌పై ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు విరాట్ కోహ్లీ. ఫలితంగా వెస్టిండీస్‌లో వరుసగా మూడు సెంచరీలు చేసిన ఆటగాడిగా సరికొత్త రికార్డును తన పేరుపై రాసుకున్నాడు.


కాగా వన్డే క్రికెట్‌లో పదేళ్లలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు టీమిండియా కెప్టెన్‌. ఈ దశాబ్దంలో 20,018 పరుగులు బాది మొదటి స్థానంలోకి దూసుకెళ్లాడు. ఇక 18,962 పరుగులతో పాంటింగ్‌ రెండో స్థానంలో ఉండగా 16,777 పరుగులతో జాక్వెస్ కలిస్‌ మూడో స్థానంలో, 16,304 పరుగులతో జయవర్ధనే నాల్గో స్థానంలో, 15,999 పరుగులతో కుమార సంగక్కర ఐదో స్థానంలో, 15,962 పరుగులతో సచిన్‌ టెండూల్కర్ ఆరో స్థానంలో ఉన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: