క్రికెట్ అంటే ఎవరైనా ఎంతగా అభిమానిస్తారో అందరికీ తెలిసిందే. అలాంటి క్రికెట్ కి ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఆదరణ ఉంది. ఇటీవల ఐపీఎల్ మ్యాచ్, వరల్డ్ కప్ మ్యాచ్ లతో బిజీ బిజీగా గడిపారు క్రికెటర్లు.  కొన్ని సార్లు క్రికెట్ వల్ల ప్రమాదాలు జరిగి తీవ్రంగా గాయాలపాలైన వాళ్లు ఉన్నారు..కొంత మంది ఏకంగా చనిపోయిన వారు ఉన్నారు.  సాధారణంగా బ్యాటింగ్ చేసేవారికి బాల్ వచ్చి తగలరాని చోట తగటడం..తలకు తాకడం వంటివి జరుగుతుంటాయి. వాటి వల్ల కొంత మంది కోమాలోకి పోయారు..మరికొంత మంద ఏకంగా చనిపోయారు. 

తాజాగా బంతి తగలడంతో దాదాపు నెల రోజుల తర్వాత ఓ అంపైర్‌ మృతిచెందాడు. నెలరోజుల పాటు ఆస్పత్రిలో ఉన్న అంపైర్‌ గురువారం కన్నుమూశాడు.  వివరాల్లోకి వెళితే.. ఇంగ్లాండ్‌ కౌంటీ క్రికెట్‌లో భాగంగా జులై 13న పెమ్‌బ్రోక్‌షైర్‌ X నార్‌బెత్‌ జట్ల మధ్య కౌంటీ క్రికెట్‌ జరిగింది. కాగా, జాన్‌ విలియమ్స్‌ ఈ మ్యాచ్‌కు అంపైర్‌గా వ్యవహరించిన వ్యవహరిస్తున్నారు..ఇదే సమయంలో బాల్ వచ్చి ఆయన తలకు బలంగా తాకడంతో త్రీవ గాయపడ్డారు.

విలియమ్స్‌ను కార్డిఫ్‌లోని ఓ ఆస్పత్రిలో చేర్పించగా కోమాలోకి వెళ్లాడు. అనంతరం మెరుగైన చికిత్స కోసం హావర్‌ఫోర్డ్‌వెస్ట్‌లోని మరో ఆస్పత్రికి తరలించారు.  చికిత్స పొందుతూ నెలరోజులు బాధపడ్డారు.  ఇక్కడ చికిత్స పొందుతూ కన్నుమూశాడు. 


మరింత సమాచారం తెలుసుకోండి: