అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) తాజాగా విడుదల చేసిన టెస్టు ర్యాంకింగ్స్‌లో టీమిండియా సారథి విరాట్ కోహ్లీ 922 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. యాషెస్‌ సిరీస్‌లో దుమ్మురేపుతున్న ఆసీస్‌ క్రికెటర్‌ స్టీవ్‌ స్మిత్‌ తన టెస్టు ర్యాంకింగ్‌ను మరింత మెరుగుపరుచుకున్నాడు. 922 పాయింట్లతో విరాట్ కోహ్లీ మొదటి స్థానంలో ఉండగా ఆసీస్ మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ 913 పాయింట్లతో రెండోవ స్థానంలో నిలిచాడు. 


ఇక మూడోవ స్థానంలో న్యూజిలాండ్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ చేరాడు. యాషెస్‌ తొలి టెస్టులో స్మిత్‌ రెండు భారీ సెంచరీలతో పాటు రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 92 పరుగులు చేశాడు. దీంతో తన టెస్టు ర్యాంకింగ్‌లో సెకండ్ కి వచ్చాడు. విరాట్ కోహ్లీ, స్మిత్ ఇద్దరి మధ్య తొమ్మిది పాయింట్లు మాత్రమే వ్యత్యాసం​ ఉండటం గమనార్హం.


యాషెస్‌లో ఇంకా మూడు టెస్టులు మిగిలి ఉండటంతో స్మిత్‌ టాప్‌ను చేరుకునే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. ఒకవేళ స్మిత్ ఇదే ఫామ్‌ను కొనసాగిస్తే స్మిత్ టాప్ లో నిలుస్తారు అనడంలో సందేహం లేదు. కాగా వెస్టిండీస్ తో భారత్ రెండు టెస్టుల సిరీస్ ఆడుతుంది. అయితే కోహ్లీ ఈ సిరీస్ లో ఆడే తీరుపైనే కోహ్లీ టాప్ ర్యాంకు ఆధారపడి ఉంటుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: