టైటిల్ చదివి ఆశ్చర్య పోతున్నారా  ? తప్పు రాశారు ఒకసారి చూసుకోండి అని చెప్పా బోతున్నారా ? అయితే ఆగండి. తప్పు ఎం రాయలేదు. ఆ టైటిల్ నిజమే వార్త నిజమే. ఇంకా విషయానికి వస్తే 'ఓ మహిళా క్రికెటర్ ఆమె భార్య ఓ బిడ్డకు జన్మనివ్వనుంది' అని వెల్లడించింది. మహిళా భార్య ఏంటి అని అనుకుంటున్నారా ? ఇక్కడే ఉంది ఓ చిక్కు. 


న్యూజిలాండ్ మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ అమీ శాటెర్త్‌వైట్ తన భార్య సహచరి లీ తహుహు గర్భంతో ఉందని, త్వరలోనే ఓ బిడ్డకు జన్మనివ్వబోతున్నట్టు సంచలన ప్రకటన చేసింది. దీంతో యావత్ ప్రపంచం ఈ సంచలన వార్తను ద్రుష్టి ఆకర్షించింది. ఆల్ రౌండర్ అయిన శాటెర్త్‌వైట్, ఫాస్ట్ బౌలర్ తహుహు 2017లో పెళ్లి చేసుకున్నారు. 


ఈ నేపథ్యంలోనే వచ్చే ఏడాది జనవరి నెలలో వారు తల్లిదండ్రులు కానున్నారని ప్రకటించింది. ఈ విషయాన్నీ ఆమె ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. వారి జీవితంలోకి కొత్తవారు అడుగుపెట్టనున్నారని ఆమె మంగళవారం ట్విట్టర్ ద్వారా ఈ వార్తను వెల్లడించింది. అయితే, వీరు బిడ్డకు ఏ పద్ధతుల ద్వారా జన్మనివ్వబోతున్నారన్న విషయం ఇంకా తెలియరాలేదు. ఏది ఏమైనప్పటి మొట్ట మొదటిసారి ఇద్దరు మహిళలు కలిసి ఓ బిడ్డకు జన్మను ఇవ్వనున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: