దాదాపు ఎనిమిది నెలల తర్వాత భారత క్రికెట్ జట్టు టెస్టు క్రికెట్ ఆడబోతుంది. వెస్టిండీస్ తో 2 టెస్టుల సిరీస్ లో భాగం గా ఆగస్టు 22 నుండి మొదటి టెస్టును నార్త్ సౌండ్ లో ఇరు జట్లు పోటీ పడనున్నాయి. భారత జట్టు తుది జట్టు కూర్పు పైన చాలా అయోమయంలో ఉంధి. ముఖ్యంగా ఓపెనింగ్ జోడీ , మిడిల్ ఆర్డర్ మరియు 4 బౌలర్లతో ఆడాలా లేక  5 బౌలర్లతో బరి లోకి దిగాలా అని ఆలోచిస్తుంది.  మయాంక్ మరియు రాహుల్ ఓపెనింగ్ ఇన్నింగ్స్ ఆరభించాలి. కానీ ఫామ్ లేమి కారణం గా ఆస్ట్రేలియా తో జరిగిన చివరి రెండు టెస్టు లకి రాహుల్ ని జట్టు నుంచి తప్పించి హనుమ విహారి చేత ఓపెనింగ్ చేయించారు. ఇప్పుడు కూడా వెస్టిండీస్ తో జరిగిన సన్నాహక మ్యాచు లో అర్ధ సెంచరీ చేశాడు. రేపటి మ్యాచ్ కి ఓపెనింగ్ జోడీ గా ఎవర్ని పంపిస్తారో ?


 హర్ధిక్ పాండ్య జట్టు కి అందుబాటు లో లేకపోవడం వలన భారత్ మరో ఇద్దరు  బాట్స్ మెన్ల ని ఆడించే అవకాశం ఉంది. ఎందుకంటే వెస్టిండీస్ లో పిచ్  లు సీమ్ -ఫ్రెండ్లీ గా ఉండే అవకాశం ఉండే సరికి భారత్ బ్యాటింగ్ ను పెంచుకునే ఆస్కారం ఉంది. మూడవ స్థానం లో పూజారా, నాలుగవ స్థానం లో కెప్టెన్ కోహ్లీ వీళ్ళ స్థానాలకి ఎటువంటి మార్పు ఉండదు. కోహ్లీ తర్వాత ఇదవ స్థానం లో ఆడే ప్లేయర్ కి గట్టి పోటీ మరియు టీమ్ మేనేజ్మెంట్ కి తలనొప్పి గా మారింది. విహరి ని ఓపెనింగ్ కి పంపించకుంటే హనుమా విహారి , అజంక్య రహనే మరియు రోహిత్ శర్మా నుంచి గట్టి పోటీ ఉంది. రహనే ఈ మధ్య కాలం లో పెద్ద గా ఫామ్ లో లేడు కానీ వెస్టిండీస్ సన్నాహక మ్యాచు లో అర్ధ సెంచరీ చేశాడు. కెప్టెన్ కోహ్లీ మద్దతు వైస్ కెప్టెన్ రహనే కి ఉన్నప్పటికి అతని ఫామ్ ఆందోళనకరం గా ఉంది.


 రోహిత్ శర్మా ఫామ్ పరం గా చూస్తే ఈ ఇయర్ రికార్డ్స్ తిరగరాసే ఫామ్ లో ఉన్నాడు. వరల్డ్ కప్ లో అత్యదిక పరుగులు చేశాడు మరియు సన్నాహక మ్యాచు లో అర్ధ సెంచరీ చేశాడు మరియు రోహిత్ తానాడిన చివరి టెస్టు మ్యాచు లోనూ అర్ధ సెంచరీ చేసి మిడిల్ ఆర్డర్ లో తను తప్పకుండ ఆడగలను అనే భావన కల్పించాడు. బౌలర్ల విషయానికి వస్తే భారతదేశం ఆరుగురు స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్‌లను ఆడిస్తే, ముగ్గురు ఫాస్ట్ బౌలర్లు బుమ్రా, షమి, మరియు ఇషాంత్ లతో ఒక స్పిన్నర్ అశ్విన్ లేదా కులదీప్ ఆడతారు. ఒకవేళ రవీంద్ర జడేజాని ఆడించాలనుకుంటే 5 స్థానం లో దిగే రహనే లేదా రోహిత్ ని పక్కన పెట్టక తప్పదు. అప్పుడు వికెట్ కీపర్ 5 స్థానం లో ఆడతాడు. కోహ్లీ  ఆరుగురు స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్‌లతో బరిలోకి దిగాలనే ఆలోచనలో ఉంటే మాత్రం 5 వ స్థానం లో స్పెషలిస్ట్ బ్యాట్స్ మెన్ ఆడతాడు. ఇక రాహుల్ .. మయంక్ తో కలిసి ఓపెనింగ్ చేస్తే విహరి ని తుది జట్టు లోకి తీసుకోకపోతే రోహిత్, రహనే ఇద్దరు తుది జట్టులో ఉంటారు. 5 బౌలర్ల తో బరిలోకి దిగితే మాత్రం రోహిత్ లేదా రహనే లో ఒక్కరూ మాత్రం తుది జట్టు లో ఉంటారు.


మరింత సమాచారం తెలుసుకోండి: