2019 ప్రపంచ కప్ సెమీ ఫైనల్ లో న్యూజిలాండ్ తో భారత్ ఓడిపోయిన తర్వాత కోచ్ గా రవి శాస్త్రి ఒప్పందం ముగిసింది.తర్వాత కోచ్ ని ఎంపిక చేసేదాక రవి శాస్త్రి మరియు అతని సహాయక బృందం సంజయ్ బంగర్ (బ్యాటింగ్), భారత్ అరుణ్ (బౌలింగ్) మరియు ఆర్ శ్రీధర్ (ఫీల్డింగ్) తో పాటు 45 రోజుల కాంట్రాక్ట్ పొడిగింపును పొందారు. భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ కి రవి శాస్త్రి తో పాటు మైక్ హెస్సన్, రాబిన్ సింగ్, ఫిల్ సిమన్స్, టామ్ మూడీ మరియు లాల్‌చంద్ రాజ్‌పుత్‌ లు భారత క్రికెట్ జట్టు కోచ్ పదవికి బి‌సి‌సి‌ఐ కి అప్లికేషన్ లు దాఖలు చేశారు.


వ్యక్తి గత కారణాల దృష్ట్యా సిమన్స్ పోటీ నుంచి తప్పుకున్నాడు. కపిల్ దేవ్, అన్షుమాన్ గైక్వాడ్, శాంత రంగస్వామిలతో కూడిన క్రికెట్ అడ్వైజరీ కమిటీ (సిఎసి) రవి శాస్త్రి ని మరలా తిరిగి 2021 టి-20 ప్రపంచ కప్ వరకు భారత క్రికెట్ జట్టుకు ప్రధాన కోచ్ గా బాధ్యత వహిస్తాడని ప్రకటించింది. భారత జట్టుకు బ్యాటింగ్, బౌలింగ్ మరియు ఫీల్డింగ్ కోచ్ లను నియమించేందుకు బోర్డు నియామక ప్రక్రియను ప్రారంభించింది.మాజీ శ్రీలంక బ్యాట్స్‌మన్ తిలాన్ సమరవీరతో పాటు భారత మాజీ క్రికెటర్లు ప్రవీణ్ అమ్రే, అమోల్ ముజుందార్, హృషికేశ్ కనిత్కర్, విక్రమ్ రాథౌర్ వంటి ఇతర అభ్యర్థులతో రాంప్రాకాష్, ట్రోట్ ఇంటర్వ్యూ చేసినట్లు తెలుస్తుంది.



ఇటీవల వరకు ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌కు ఫీల్డింగ్ కోచ్‌గా పనిచేసిన మాజీ దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మన్ జోంటి రోడ్స్, ఇంగ్లండ్‌కు వెళ్లేముందు దక్షిణాఫ్రికా అండర్ -19 లో ప్రాతినిధ్యం వహించిన యాంట్ బోథా ఫీల్డింగ్ కోచ్ పదవికి దరఖాస్తు చేసుకున్నారు. బౌలింగ్ కోచ్ స్థానం కోసం, దరఖాస్తుదారులలో వెంకటేష్ ప్రసాద్, సునీల్ జోషి, అమిత్ భండారి, పరాస్ మంబ్రే ఉన్నారు. ఎంపిక ప్యానెల్ మూడు స్థానాలకు (బ్యాటింగ్, బౌలింగ్ మరియు ఫీల్డింగ్ )తుది ఎంపికల యొక్క షార్ట్‌లిస్ట్‌ను బోర్డుకు పంపుతుంది, ఇది తుది నిర్ణయాలు తీసుకునే ముందు ప్రధాన కోచ్‌ రవి శాస్త్రి అభిప్రాయాలను తీసుకుంటుంది.శాస్త్రి తన ప్రస్తుత సహాయక సిబ్బంది - సంజయ్ బంగర్ (బ్యాటింగ్ ), భారత్ అరుణ్ (బౌలింగ్) మరియు ఆర్ శ్రీధర్ (ఫీల్డింగ్) లతో అంటుకునే అవకాశం ఉందని అనుకుంటున్నారు - ఈ ముగ్గురూ ఈ నియామక ప్రక్రియలో ఆటోమేటిక్ ఎంట్రీలు. ఈ ముగ్గురు వ్యక్తులను 2014 లో శాస్త్రి టీమ్ డైరెక్టర్‌గా భారత క్రికెట్ జట్టు డ్రెస్సింగ్ రూమ్‌లో చేరినప్పుడు ఎంపిక చేశారు. 2016-17లో అనిల్ కుంబ్లే ప్రధాన కోచ్ గా ఉన్నప్పుడు రవి శాస్త్రి ఒక సంవత్సరం గైర్హాజరులో కూడా బంగార్ మరియు శ్రీధర్ తమ పదవులను కొనసాగించారు, అయినప్పటికీ అరుణ్ ఒకసారి తొలగించి తిరిగి నియమించబడ్డారు.


ఈ వారంలో సహాయక సిబ్బందిని నియమించడానికి బి‌సి‌సి‌ఐ అనేక మందిని ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఇంగ్లాండ్ మాజీ బ్యాట్స్ మెన్ మార్క్ రాంప్రాకాష్ మరియు జోనాథన్ ట్రోట్ తదుపరి భారత బ్యాటింగ్ కోచ్ పాత్ర కోసం ఉన్నత స్థాయి అభ్యర్థులుగా నిలిచారు. జోనాథన్ ట్రోట్ ఇంగ్లాండ్ తరుపున 52 టెస్టులు ఆడి 44.08 సగటు తో 3835 పరుగులు ,68 వన్డే మ్యాచ్ లు ఆడి 51.25 సగటు తో 2819 పరుగులు చేశాడు.మెన్ మార్క్ రాంప్రాకాష్ ఇంగ్లాండ్ తరుపున 52 టెస్టులు ఆడి 2350 పరుగులు చేశాడు. ఫైనల్ గా రవి శాస్త్రి ఇప్పటికైనా తన సహాయక సిబ్బందిని మార్చి కొత్త వారితో కలిసి పని చేస్తాడో లేక పాత సిబ్బంది కావాలని పట్టుబట్టి కూర్చుంటాడో చూడాలి , బి‌సి‌సి‌ఐ నుంచి అందిన సమాచారం బట్టి ఈ సారి అసిస్టెంట్ కోచ్ లను కొత్త వారిని ఎంపిక చేసే పని లో ఉంది కావున ఈ సారి బ్యా టింగ్ కోచ్ పదవి లో వీరిలో ఒకర్ని చూడొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: