పీవీ సింధు చరిత్ర సృస్టించింది. ఎప్పుడు ఫైనల్ వరుకు వచ్చి ఓడిపోయే సింధు ఎట్టకేలకు ఫైనల్ ఫోబియాను వీడి, ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌ నెగ్గి చరిత్ర సృష్టించింది మన తెలుగింటి పీవీ సింధు. ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్స్‌లో జపాన్‌ స్టార్ షట్లర్, టాప్ సీడ్ ఒకుహరపై 21-7, 21-7 తేడాతో ఘనవిజయం సాధించింది మన తెలుగు తేజం. 


ఈ మ్యాచ్ లో ఒకుహరపై నెగ్గడం ద్వారా, 2017 వరల్డ్ ఛాంఫియన్‌షిప్‌ ఫైనల్స్‌లో ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది. ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ లో గోల్డ్ మెడల్ సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా సింధు రికార్డ్ నెలకొల్పింది. 40 ఏళ్ల భారత కలను నెరవేర్చిన మన తెలుగు స్వర్ణ 'సింధు'రాన్ని ప్రపంచ వ్యాప్త క్రీడాభిమానులు ప్రశంశలతో ముంచెత్తుతున్నారు. 


ఏకపక్షంగా సాగిన ఈ ఫైనల్ మ్యాచ్ లో ప్రత్యర్థి ఫై పీవీ సింధు పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శింది. తొలి రౌండ్‌ను 21-7 తేడాతో గెల్చుకున్న సింధు రెండో రౌండ్‌లోనూ అదే ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ గేమ్ ను చేజిక్కించుకుంది. రెండో రౌండ్ లో ప్రత్యర్థి ఒకుహర కు బ్రేక్ ఇవ్వకుండా 2వ పాయింట్‌ నుంచి 9 పాయింట్ల వరకు వరుసగా సాధించింది. ఈ విజయంతో మహిళల బ్యాడ్మింటన్ విభాగంలో, భారత చిరకాల స్వప్నం నెరవేరినట్టైంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: