విండీస్ తో జరుగుతున్న తొలి టెస్టు మూడో రోజు ఆటలో భాగంగా టీమిండియా ఆటగాళ్లు చేతికి నల్ల రిబ్బన్లు ధరించి మైదానంలోకి దిగారు. ఎందుకంటే.. కేంద్ర మాజీ మంత్రి, మాజీ ఢిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు అరుణ్‌ జైట్లీ మరణానికి సంతాపంగా ఆటగాళ్లు చేతికి నల్ల రిబ్బన్లు ధరించారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ అరుణ్ జైట్లీ ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ శనివారం ఉదయం తుది శ్వాస విడిచారు. కేంద్ర మంత్రిగా, ఢిల్లీ ముఖ్యమంత్రిగా జైట్లీ సేవలు చిరస్మరణీయం.  


అరుణ్ జైట్లీకి భారత క్రికెట్ కు విడదీయరాని సంబంధం వుంది. ఢిల్లీ డిస్ట్రిక్‌ క్రికెట్‌ అసోసియేషన్ అధ్యక్షుడిగా జైట్లీ1999-2013 వరకు సుదీర్ఘకాలం పని చేశారు. అంతేకాకుండా.. బీసీసీఐ ఉపాధ్యక్షుడిగా కూడా తన సేవలందించారు. జైట్లీ హయాంలో  ఢిల్లీ క్రికెట్‌ అభివృద్ధికి చాల కృషి చేశారు. ఆటగాళ్ల సమస్యలను, వారికి మౌలిక వసతులను కల్పించడంలో ప్రధాన పాత్ర పోషించారు. జైట్లీ డీడీసీఏ అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే ఢిల్లీ ఆటగాళ్లు వీరేంద్ర సెహ్వాగ్‌, గౌతమ్‌ గంభీర్‌ వంటి దిగ్గజ ఆటగాళ్లు  తదితరులు టీమిండియా తరుపున ఆడారు.


ఇకపోతే.. అరుణ్ జైట్లీ మృతి పట్ల దేశవ్యాప్తంగా రాజకీయ ప్రముఖుల నుండి సంతాప సందేశాలు వెల్లువెత్తుతున్నాయి. అలాగే, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కెసిఆర్ , వైస్ జగన్ తమ సంతాపాన్ని తెలియజేశారు. దేశం ఒక నిరాడంబరుడైన ఓ గొప్ప నేతను కోల్పోయిందని, ఆయన లేని లోటు పూడ్చలేనిది నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా విచారం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రపతి, ప్రధాని మొదలు సామాన్య పౌరుడి వరకు అరుణ్ జైట్లీ సేవలను గుర్తుచేసుకొని విచారం వెలిబుచ్చుతున్నారు. ఇదిలావుంటే.. కొద్దీ రోజుల వ్యవధిలోనే సుష్మస్వరాజ్, అరుణ్ జైట్లీ వంటి ఇద్దరు గొప్ప నేతలను కోల్పోవడంతో  బీజేపీ కార్యకర్తలు కూడా డీలాపడ్డారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: