టీమిండియా మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని కొత్త లుక్‌తో అందరిని ఆశ్చర్యపరిచాడు. మొన్నటికి మొన్న ధోని కొత్త లుక్ అని నార్త్ ఇండియా రాజకీయనాయకులు ఉండే ఫోటోలు బయటకు వచ్చి సోషల్ మీడియాలో వైరల్ అయినా సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు మరో కొత్త లుక్ తో తళుక్కుమని నక్షేత్రంలా మెరిసి ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చాడు. 


తలకు నలుపు రంగు గుడ్డ కట్టుకుని టీషర్ట్‌ ధరించి చిరునవ్వులు చిందిస్తూ విమానాశ్రయం నుంచి బయటకు వస్తున్న ధోని వీడియోను అభిమానులు సోషల్ మీడియాలో షేర్‌ చేశారు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అభిమానులతో కలిసి ధోని తీసుకున్న ఫొటోలు, సెల్ఫీలు కూడా సోషల్‌ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. 


భారత సైన్యంలో 106 టీఏ పారామిలటరీ బెటాలియన్‌తో కలిసి 15 రోజుల శిక్షణ పూర్తి చేసుకున్న ధోని ఆగస్టు 15న లేహ్‌లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న సంగతి తెలిసిందే.  అయితే ఈ కొత్త లుక్స్ వెనుక అసలు కారణం క్రికెట్ కి రాజీనామా అని, అతని రాజీనామాకు సమయం ఆసన్నమైంది అని మరోపక్క ఊహాగానాలు కొనసాగుతున్నాయి. ఒకవేళ ధోని రాజీనామా ప్రకటిస్తే రాజకీయాల్లోకి వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అని అంటున్నారు నెటిజన్లు. మరి ధోని నిర్ణయం ఎటో తెలియాల్సి ఉంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: