యాషెస్ మూడో టెస్ట్ లో ఇంగ్లాండ్ గెలవడానికి  ఆస్ట్రేలియా  కెప్టెన్  టిమ్ పైనీ నే కారణమంటూ  అతని ఫై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు  ఆసీస్ మాజీ క్రికెటర్లు.  ఇంతకి  పైనీ చేసిన తప్పేంటి అంటే రివ్యూ వృధా చేయడమే...  ఆ రివ్యూ ఉండి ఉంటే  ఆసీస్ గెలిచేదే.  రివ్యూ ను వాడకూడని దగ్గర వాడి  వాడాల్సిన దగ్గర  లేకుండా చేయడంతో  భారీ మూల్యం చెల్లించుకున్నాడు పైనీ.లీచ్ బ్యాటింగ్  చేస్తున్న క్రమంలో ఎల్బీడబ్ల్యు కోసం  అప్పీల్ చేశాడు పైనీ  అయితే అది అవుట్ సైడ్ లెగ్ అని  బౌలర్ తో పాటు ఆసీస్ ఫీల్డర్లు  సరిగ్గా అప్పీల్ కూడా చేయలేదు. ఇక ఎంపైర్  పైనీ అప్పీల్ ను తిరస్కరించడంతో  అతను రివ్యూ తీసుకున్నాడు. రివ్యూ లో కూడా అవుట్ సైడ్ లెగ్ అనే స్పష్టంగా తేలింది. దాంతో ఆసీస్ రివ్యూ కోల్పోయింది.




ఇక  నాథన్ లయాన్ బౌలింగ్ లో  స్టోక్స్ వికెట్ల ముందు దొరికిపోయాడు.  అయితే  ఆసీస్ ఆటగాళ్ల అప్పీల్ ను  ఎంపైర్ జోయల్ విల్సన్ తిరస్కరించడంతో స్టోక్స్ బ్రతికి పోయాడు . రివ్యూ లో మాత్రం  అది అవుట్ అని తేలింది. కానీ ఆసీస్ కు రివ్యూ కు వెళ్లేందుకు అవకాశం లేకుండా పోయింది. అలా ఆసీస్ గెలవాల్సిన మ్యాచ్ లో ఓటమిని చవిచూసింది. ఇక  పైని  చేసిన తప్పిదం మాజీ ఆటగాడు  ఇయాన్ చాపెల్ కు ఆగ్రహం తెప్పించింది. దాంతో మా కెప్టెన్ కు అసలు బుర్ర లేదు నువ్వు ఎలా కెప్టెన్ అయ్యావంటూ విరుచుకపడ్డాడు. లీచ్‌ ఔట్‌పై రివ్యూకు వెళ్లడం ఏమిటి. అది ఔట్‌ కాదనే విషయం సహచర క్రికెటర్లకు అర్థమైంది. కానీ నువ్వు తెలుసుకోలేకపోయావు అని చాపెల్‌ విమర్శించాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: