మహిళా క్రికెట్ కు  వన్నె తెచ్చిన గొప్ప మహిళా క్రికెటర్ ఆమె.  కేవలం పురుషుల క్రికెట్ ఆట మాత్రమే ఉన్న సొంతమైన క్రికెట్ అభిమానులని ...వాళ్ళకంటే మేము ఎక్కడ తక్కువ కాము అంటూ నిరూపించిన మహిళా క్రికెట్ క్యాప్టెన్ ఆమె . ఒక్క సారి సారి బ్యాట్ జుళిపిస్తే  మహిళలు కూడా పరుగుల వరద పారించగలరు అని నిరూపించింది .ఆమెనే మిథాలీ రాజ్ .
మహిళా క్రికెట్ కొత్త గుర్తింపు  తెచ్చిన డైనమిక్ మహిళా క్రికెటర్ ..బ్యాట్ తో పరుగుల వరద పారించి దేశం చూపు మొత్తం మహిళా క్రికెట్ వైపు వచ్చేలా  చేసింది మిథాలీ . తన ఆట తో అర్జున అవార్డును దక్కించుకుంది .  తాజాగా మిథాలీ రాజ్ టి 20  క్రికెట్ కు వీడ్కోలు పలుకుతున్నట్టు ప్రకటించింది .2021 ఐసీసీ వన్డే మహిళల ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకొని అంతర్జాతీయ  టీ20 ఫార్మాట్‌కు దూరం అవుతున్నానని తెలిపింది .


 టి 20 ఫార్మాట్ లో 89  మ్యాచులాడిన మిథాలీ మొత్తం 2364   పరుగులు సాధించింది .భారత్ నుండి అత్యధిక పరుగులు సాధించిన మహిళా క్రికెటర్ గా టాప్ ప్లేస్ లో ఉంది మిథాలీ . 2006  నుండి పొట్టి క్రికెట్ కు ప్రాతినిధ్యం వహించగా ...మొత్తం 32  మ్యాచ్ లకి క్యాప్టెన్ గా వ్యవహరించింది . కాగా ఇందులో 2012  , 2014  ,2016  వరల్డ్ కప్ మ్యాచ్ లు కూడా ఉన్నాయి .
2021 వన్డే ప్రపంచకప్‌ టోర్నీకి అన్ని రకాలుగా సిద్ధంగా ఉండాలని...ప్రపంచకప్ పై పూర్తిగా ద్రుష్టి పెట్టేందుకు  టి 20  ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు తెలిపింది . అత్యుత్తమంగా పోరాడి భారత్ కి వరల్డ్ కప్ అందించాలనేది  తన లక్ష్యం  అని పేర్కొంది .. నన్ను నిరంతరం ప్రోత్సహించిన బీసీసీఐకి ధన్యవాదాలు. స్వదేశంలో దక్షిణాఫ్రికాతో తలపడే భారత టీ20 జట్టుకు అభినందనలు' అంటూ  అని మిథాలీ భావోద్వేగంతోప్రకటించింది 



మరింత సమాచారం తెలుసుకోండి: