అంబటి రాయుడు మన తెలుగు క్రికెటర్. ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచ కప్ జట్టులో చోటు కోసం ఎంతో ప్రయత్నించి, చోటు దక్కించుకోలేక, అప ట్విట్టర్ లో 3 డిల ట్విట్ పెట్టి ఉన్న అవకాశాన్ని కూడా చేజేతులారా జరా విడచుకొని క్రికెట్ కు గుడ్ బై చెప్పిన అంబటి రాయుడు సీనియర్ల సలహా మేరకు రాజీనామాను వెనక్కి తీసుకొని అనుకోని రీతిలో మరోసారి క్రికెట్ జట్టులో చేరాడు అంబటి రాయుడు. 


అయితే అంబటి రాయుడు ట్విట్టర్ లో అప్పుడు పెట్టిన 3 డి ట్విట్ పై ఎన్నో వార్తలు వచ్చాయి. ప్రపంచకప్ జట్టులో అతనికి అవకాశం రాకపోవడానికి ఆ 3 డి ట్విట్టే కారణం అని కూడా వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తలపై ఎట్టకేలకు ఇన్నాళ్లకు స్పందించాడు అంబటి రాయుడు. ఆ ట్విట్ పై స్పందిస్తూ 3 డి ట్విట్ వల్ల అతన్ని పక్కన పెట్టారని అతను భావించడం లేదని, 


ఒకవేళ అది నిజమైతే ఆటగాళ్లు ఏం చేయాలన్నదానిని తాను ఊహించలేనన్నాడు. జట్టులో నాలుగో స్థానం కోసం బాగా శ్రమించానని, చోటు దక్కకపోవడంతో తీవ్ర నిరాశ గురయ్యాడని, అందుకే ఎంపికలో భాగంగా వేరేవారికి అవకాశం ఇచ్చి తనను పక్కన పెట్టి ఉండొచ్చని అన్నాడు అంబటి రాయుడు. అయితే ఆలా అవకాశం రాకపోవడంతోనే అంబటి రాయుడు రిటైర్మెంట్ ప్రకటించాడు. 



మరింత సమాచారం తెలుసుకోండి: