అనంతరం స్వల్ప లక్ష్య ఛేదన తో బరిలోకి దిగిన న్యూ జిలాండ్ ను దెబ్బతీశాడు మలింగ. తనుకు మాత్రమే సాధ్యమయ్యే యార్కర్ల తో కివీస్ బ్యాట్స్ మెన్ ను భయపెడుతూ నాలుగు బంతుల్లో నాలుగు కీలక వికెట్లు తీసి మ్యాచ్ ను తమ వైపు తిప్పాడు. మొదటి ఓవర్లో కేవలం రెండు పరుగులు ఇచ్చి వికెట్ల ఖాతా తెరవకుండానే ఆ ఓవర్‌ను ముగించిన మలింగా.. మూడో ఓవర్ మూడో బంతికి కోలిన్ మున్రో అవుట్ చేసి మొదటి వికెట్ తీశాడు. అదే ఓవర్లో మిగిలినమూడు బంతుల్లో రూథర్ ఫోర్డ్ , కోలిన్ డి గ్రాండ్ హోమ్ , రాస్ టేలర్ లను డకౌట్ చేసి నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు తీసి మలింగ చరిత్ర సృష్టించాడు.
ఇంతకుముందు అతను వన్డేల్లో కూడా నాలుగు బంతుల్లోనాలుగు వికెట్లు తీసి రికార్డు సృష్టించాడు. మలింగ కు తోడు మిగిలిన బౌలర్లు కూడా రాణించడంతో న్యూజిలాండ్ 16ఓవర్లలో 88 పరుగులకే అల్ అవుట్ అయ్యి ఓటమిని చవిచూసింది. కివీస్ బ్యాట్స్ మెన్ లలో కెప్టెన్ సౌతీ 28పరుగులతో అజేయంగా నిలిచాడు. ఇక ఈమ్యాచ్ లో 4ఓవర్లు వేసిన మలింగ 6పరుగులు మాత్రమే ఇచ్చి 5కీలక వికెట్లు పడగొట్టాడు. మూడు మ్యాచ్ ల సిరీస్ లో 2- 1 తో సిరీస్ ను న్యూజిలాండ్ కైవసం చేసుకోగా తాజా విజయం శ్రీలంక కు ఊరటనిచ్చింది. అద్భుతమైన బౌలింగ్ తో అదరహో అనిపించినా మలింగ కు మ్యాన్ అఫ్ ది మ్యాచ్ లభించగా సౌథీ ప్లేయర్ అఫ్ ది సిరీస్ అవార్డు ను సొంతం చేసుకున్నాడు