యాషెస్ నాల్గో టెస్ట్ లో ఆస్ట్రేలియా  ఘన విజయం  సాధించి సిరీస్ లో  2-1ఆధిక్యం తో ట్రోఫీ ని నిలబెట్టుకుంది. ఒకవేళ ఐదో టెస్ట్ లో  ఇంగ్లాండ్ గెలిచినా  కూడా  గత యాషెస్ లో ఆస్ట్రేలియానే విజేత కాబట్టి సిరీస్ డ్రా  అయినా ట్రోఫీని ఆ జట్టే అంటి పెట్టుకోనుంది.  కాగా నాల్గో టెస్ట్ లో 383పరుగుల లక్ష్య ఛేదనలో  రెండో ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్  197 పరుగులకే  ఆల్ అవుట్  అయ్యి పరాజయాన్ని చవిచూసింది.  ఓవర్ నైట్ స్కోర్ 18/2తో   ఐదవ రోజు బ్యాటింగ్ కొనసాగించిన ఇంగ్లాండ్  ను  డెన్ లీ , రాయ్ లు ఆదుకున్నారు. అయితే  ఈక్రమంలో  66 పరుగుల వద్ద  రాయ్ వెనుదిరగడం తో ఇంగ్లాండ్ కథ మళ్ళీ మొదటికి వచ్చింది.  స్వల్ప వ్యవధిలోనే   స్టోక్స్ , డెన్ లీ లు పెవిలియన్ చేరడంతో  ఇంగ్లాండ్  ఓటమి ఖాయమైంది.  ఆ తరువాత బెయిర్ స్టో , బట్లర్  లు కూడా ఎక్కువ సేపు క్రీజ్ లో నిలబడలేకపోయారు. .   



దాంతో  ఓ దశలో ఇంగ్లాండ్   8వికెట్ల నష్టానికి  172 పరుగులు చేసి పరాజయం అంచున నిలిచింది. అయితే ఈక్రమంలో  ఓవర్ టోన్ ,లీచ్ అద్భుతంగా పోరాడారు. మరో  15ఓవర్ల పాటు వీరు క్రీజ్ లో ఉంటే  మ్యాచ్ డ్రా అయ్యేదే.  కానీ  పార్ట్ టైం బౌలర్  లబుషెన్లీచ్ ను అవుట్ చేసి  ఈ జోడీని విడదీయడంతో ఇంగ్లాండ్ ఆశలు ఆవిరయ్యాయి.  ఆతరువాత కాసేపటికే ఓవర్ టోన్  చివరి వికెట్ గా వెనుదిరగడం తో  ఆసీస్ జయకేతనం ఎగుర వేసింది.



అద్భుతమైన  స్వింగ్  తో  కమ్మిన్స్  4 వికెట్లు తీసి ఇంగ్లాండ్ భరతం పెట్టాడు.  ఇంగ్లాండ్ బ్యాట్స్ మెన్ లలో ఓపెనర్ జాయ్ డెన్ లీ 53 పరుగులతో రాణించాడు. కాగా  మొదటి ఇన్నింగ్స్ లో డబుల్ సెంచరీ రెండో ఇన్నింగ్స్ లో హాఫ్ సెంచరీ తో  మ్యాచ్ ను శాసించిన స్టీవెన్ స్మిత్ కు మ్యాన్ అఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.   

మరింత సమాచారం తెలుసుకోండి: