పీవీ సింధు తాజాగా ప్రపంచ చాంపియన్షిప్ను నెగ్గింది బాడ్మింటన్ లో ఇటువంటి చాంపియన్షిప్లో వరుస విజయాలతో అనేది మొట్టమొదటి సారిగా జరుగుతోంది. అంతకుముందు పీవీ సింధు ఒలింపిక్స్ మెడను కూడా గెలుచుకుంది. మరి గోపీచంద్ ను పక్కన పెట్టి వలసిన అవసరం ఏమి వచ్చింది అనేదే కదా మీ ప్రశ్న.

గోపీచంద్ ఇప్పటికీ పీవీ సింధు ప్రధాన కోచ్. కాకపోతే వచ్చే కాలంలో ఉన్న ఇతర పోటీలకు సిద్ధం చేయడం కోసం అధిక శిక్షణ అవసరమని అనుకున్నారు. ఇందుకుగాను ఇతర కోర్సులను కూడా జోడించి శిక్షణను పెంచుతున్నారు. ఈ కొత్త కోచ్ పేరు కిం జీ హ్యున్.

కనీసం నాలుగు నెలల పాటు అయినా ఈ కొత్త కోచ్ కింద పీవీ సింధుకు శిక్షణ అవసరమని చెప్పారు. అక్కడ అక్కడ ఎటువంటి ఆటగాడికి అయినా లోపాలు ఉంటాయని వాటిని కూడా సరి చేసి పూర్తిగా సింధువును సంసిద్ధం చేయాలనుకుంటున్నాం అని చెప్పారు. 24 ఏళ్ల సింధుకు ఇప్పటికే ఎన్నో విజయాలను సాధించిన ఇంకా పట్టుదల తగ్గలేదు.

ఈ కొత్త కోచ్ సౌత్ కొరియా దేశస్థుడు. ప్రత్యర్థులను సింధు ఏ విధంగా చిత్తు చేసిందో ఆయన బాగా గమనించి ఆటలో ఇంకా ఎటువంటి మెలకువలు నేర్పించాలి అర్థం చేసుకున్నారు. గోపీచంద్ మరియు కొత్త కోచ్ ఇద్దరూ కలిసి సింధుకు శిక్షణ ఇవ్వబోతున్నారు అట. నెట్ కు దగ్గరగా ఉండే ఆటను సింధు ఇంకా పూర్తిగా నేర్చుకో లేదట అది నేర్పించడానికి ఈ కొత్త కోచ్ అని వివరణ ఇచ్చారు.




మరింత సమాచారం తెలుసుకోండి: