ఇండియన్ క్రికెటర్, మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్ మెంట్ పై ఊహాగానాలు ఇంకా తెరపడలేదు. ప్రస్తుతం అమెరికా లో సేదతీరుతున్న ధోనీ రిటైర్ మెంట్ పై దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే కీలక వ్యాఖ్యలు చేశాడు వచ్చే ఏడాది టీ20 వరల్డ్ కప్ లో ధోనీని ఆడించాలనుకుంటే ఇప్పట్నుంచే అతని రెగ్యులర్ ఆటగాడి గా జట్టు తో పాటే వుంచాలని బీసీసీఐ కు విజ్ఞప్తి చేశారు. ఒకవేళ అతడు అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికితే గౌరవం గానే జట్టు నుంచి సాగనంపాలని టీమిండియా మేనేజ్ మెంట్ కు సూచించాడు.


 ధోనీ రిటైర్ మెంట్ అంశంపై ఎవరికీ క్లారిటీ లేదు అతడు అంతర్జాతీయ క్రికెట్ కు ఎప్పుడు వీడ్కోలు చెబుతాడో తెలియదు, కాబట్టి ధోనీ భవితవ్యంపై సెలెక్టర్ లు ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి. టీ20 ప్రపంచకప్ లో ధోనీని ఆడించాలని భావిస్తే ఇప్పట్నుంచే రెగ్యులర్ గా అతడిని జట్టులో స్థానం కల్పించాలి. అలా కాకుండా యువ క్రికెటర్ లు అవకాశం ఇవ్వాలని అనుకుంటే ధోనీకి గౌరవంగా వీడ్కొలు చెప్పండి అన్నారు.

 భారత జట్టు కు ఎన్నో అపురూప విజయాలనందించిన ధోనీ గౌరవమైన వీడ్కోలుకి  అర్హుడు అని కుంబ్లే పేర్కొన్నారు. మరోవైపు దక్షిణాఫ్రికా తో జరగనున్న ద్వైపాక్షిక సిరీస్ లో భాగంగా మూడు టీ20 సిరీస్ కు ధోనీని ఎంపిక చేయని సంగతి తెలిసిందే. యువ క్రికెటర్ లకు అవకాశమిచ్చే క్రమం లోనే ధోనీ జట్టు కు దూరంగా ఉన్నాడని చీఫ్ సెలెక్టర్ ఎమ్.ఎస్.కె ఆ సమయంలో పేర్కొన్నాడు. అయితే ధోనీని తప్పించాలంటూ నిర్ణయం సెలక్టర్లదే అని చాలా మంది నెటిజన్ లు తీవ్ర విమర్శలు చేశారు.

 ఈ తరుణం లో అనిల్ కుంబ్లే స్పంధించడంతో ఆ విమర్శలకు మరింత బలాన్ ని చేకూరుస్తోంది. ఇక గతంలో కూడా కొంత మంది మాజీ క్రికెటర్ లకు గర్వమైన వీడ్కొలు ఇవ్వలేదు బీసీసీఐ. జట్టు లో రాజకీయాలు విరాట్ కోహ్లీ రవిశాస్త్రి కి నచ్చిన క్రికెటర్ లకి అవకాశాలు ఇస్తున్నార ని ట్విట్టర్ లో కామెంట్స్ వినిపిస్తున్నాయి మరి దీనికి వారిద్దరూ ఎలా స్పందిస్తారో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: