భారత ప్రధాన కోచ్ గా తిరిగి నియమించబడిన తరువాత రవిశాస్త్రి అతని వేతనంపై పెంపును ఆశిస్తున్నారు ఇది దాదాపు  కోచ్  వార్షిక వేతనం పై 20 శాతం పెరుగుదల ఉంటుంది. ఒకవేళ ఇది పెరిగితే అతని వార్షిక వేతనం 9.5 కోట్ల నుంచి  10 కోట్ల మధ్య ఉంటుంది. తను పోయిన సంవత్సరం  సుమారు 8 కోట్ల రూపాయల వేతనం అందుకున్నాడు. అలాగే, అతని సహాయక సిబ్బందికి కూడా పెంపు లభిస్తుంది, బౌలింగ్ కోచ్‌గా కొనసాగుతున్న అరుణ్‌కు సుమారు 3.5 కోట్ల రూపాయలు లభిస్తాయని, ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్ కి కూడా అంతే ఉంటుందని అంచనా. సంజయ్ బంగర్ స్థానంలో బ్యాటింగ్ కోచ్‌గా నియమితుడైన విక్రమ్ రాథౌర్ కి 2.5 కోట్ల నుంచి రూ .3 కోట్ల నుంచి ప్రారంభం కానుంది. ఈ కొత్త ఒప్పందాలన్నీ సెప్టెంబర్ 1 నుండి అమల్లోకి వస్తాయి.

"నేను మళ్ళీ  ఇక్కడకు రావడానికి కారణం ఈ జట్టు   వేరే  జట్ల లాగా సంపాదించిన వారసత్వాన్ని వదిలివేయగలరనే నాకు ఉన్న నమ్మకం, ఇతర జట్లు కొన్ని విషయాలలో దిగజారి ప్రయత్నిస్తాయి" అని శాస్త్రి తన నియామకం తరువాత  చెప్పారు .

"తరువాతి రెండేళ్ళలో వైట్-బాల్ సెటప్ మరియు టెస్ట్ రెండింటిలోనూ చాలా మంది యువకులను జట్టూ లోకి తీసుకు వచ్చి ఒక సున్నితమైన పరివర్తనను తీసుకురావాలి,  నా పదవీకాలం ముగిసే సమయానికి జట్టు కి మీరు మరో మూడు-నాలుగు బౌలర్లను గుర్తించాలి. ఈ పదవీకాలం ముగిసేనాటికి నా ప్రయత్నం జట్టును  రాబోయే సమయంలో ఒక మంచి వారసత్వాన్ని నెలకొల్పే విధంగా తయారుచేయడం ” అని శాస్త్రి అన్నారు.

తాను, జట్టుతో పాటు, అన్ని రంగాల్లోనూ మెరుగుపడటానికి ప్రయత్నిస్తానని, వారు తప్పుల నుండి తను కూడా నేర్చుకుంటారని ఆయన తెలిపారు. “మీరు మీ తప్పుల నుండి నేర్చుకోవాలి, ఎవరూ పరిపూర్ణంగా లేరు. మీరు మెరుగు పడడానికి ప్రయత్నిస్తున్నప్పుడు, మీ పరిధిని పెంచడానికి ప్రయత్నిస్తున్నప్పుడు మీరు చాలా శ్రద్ధ వహించాలి, ” అని జట్టును ఉద్దేశించి అతను చెప్పాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: