టీమ్ ఇండియా ప్రధాన కోచ్ రవిశాస్త్రి కి లక్ మాములు గా లేదు.  ప్రపంచ కప్ సెమిస్ లో భారత్ ఓటమి తర్వాత టీమ్ ఇండియా అభిమానుల నుండీ రవిశాస్త్రి తీవ్ర విమర్శలు ఎదుర్కోగా...  అతడి పదవి కాలం ముగియడం,  బీసీసీఐ కూడా  కోచ్ ల విషయం లో ప్రక్షాళన చేపట్టడం తో ఈ దెబ్బ తో  టీమిండియా కు కొత్త కోచ్  వస్తాడని అందరూ భావించారు.  కానీ కపిల్ దేవ్ నేతృత్వం లోని కమిటీ రవిశాస్త్రి కే ఓటు వేయడంతో ఇటీవల మళ్ళీ ప్రధాన కోచ్ గా ఎంపికైయ్యాడు రవిశాస్త్రి.



ఇకఇదిలా ఉంటే ఇప్పుడు  మరో సారి రవి శాస్త్రి సుడి తిరిగింది.  తాజాగా అయిన  వార్షిక వేతనం 20శాతం పెంచుతూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది.  దాంతో ఇంతకుముందు సంవత్సరానికి  8కోట్ల వేతనం అందుకున్న రవిశాస్త్రి ఇప్పుడు ఏడాదికి 10 కోట్ల వరకు వేతనం పొందనున్నాడు.  రవిశాస్త్రి తో పాటు బౌలింగ్‌ కోచ్‌గా ఎంపికైన భరత్‌ అరుణ్, ఫీల్డింగ్‌ కోచ్‌ ఆర్‌.శ్రీధర్‌ల  వేతనాలు కూడా పెరిగాయి.  వీరికి  ఏడాదికి రూ.3.5 కోట్ల వేతనం అందనుంది. వీరితో పాటు  కొత్త బ్యాటింగ్ కోచ్   విక్రమ్‌ రాఠోడ్‌ రూ.2.5 కోట్ల నుంచి రూ.3 కోట్ల వరకు ఆర్జిస్తారని సమాచారం. వీరి ఒప్పందాలన్నీ సెప్టెంబర్‌ 1 నుంచి అమల్లోకి వస్తాయి.



ఇక  టీమ్ ఇండియా కు  నాలుగో స్థానానికి పరిష్కారం చూపడం లో విఫలం కావడం తో సంజయ్ బంగర్ ను తప్పించి అతని స్థానం లో విక్రమ్ రాఠోడ్‌ ను బ్యాటింగ్ కోచ్ గా ఎంపిక చేసింది మేనేజ్ మెంట్ . కాగా అద్భుతంగా  రాణిస్తున్న మనీశ్‌ పాండే, శ్రేయస్‌ అయ్యర్‌లకు అవకాశాలిచ్చి నాలుగో స్థానం సమస్యకు  పరిష్కారం చూపిస్తామని  విక్రమ్‌ రాఠోడ్‌ ధీమా వ్యక్తం చేశాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: