నిషేధం తరువాత   యాషెస్ సిరీస్ ద్వారా తొలి టెస్ట్ సిరీస్ ఆడుతున్న  ఆసీస్ స్టార్ బ్యాట్స్ మెన్  డేవిడ్ వార్నర్ , స్టీవెన్ స్మిత్ లకు మొదటి టెస్ట్ లోనే  అవమానాలు ఎదురైయ్యాయి.  ఆటెస్ట్ లో  వార్నర్, స్మిత్ లు బ్యాటింగ్ చేస్తున్న  సమయంలో  ఇంగ్లాండ్ అభిమానులు వారిని  చీటర్ చీటర్ అంటూ హేళన చేశారు. అయితే  ఆ అవమానాన్ని   సీరియస్ గా తీసుకున్న స్మిత్ అప్పటినుండి  ఇంగ్లాండ్  బౌలర్ల కు చుక్కలు చూపెడుతున్నాడు.  అందులో భాగంగా మొదటి  టెస్ట్ లో రెండు ఇన్నింగ్స్ ల్లో రెండు సెంచరీలు  , రెండో  టెస్ట్ లో  ఓ సెంచరీ , ఓ హాఫ్ సెంచరీ , తాజాగా జరిగిన  నాల్గో టెస్ట్ ఓ ద్విశతకం తో పాటు ఓ హాఫ్ సెంచరీ చేసి స్మిత్  తమ జట్టును  2-1 ఆధిక్యంలో నిలబెట్టాడు.  కాగా  రెచ్చిపోయి ఆడుతున్న  స్మిత్ ఫై ఇంగ్లాండ్ అభిమానులకు ఇప్పటికే  పీకలదాకా కోపం ఉండగా  నాల్గో టెస్ట్ తరువాత స్మిత్ చేసిన  పని  వారిని  మరింత ఉడికించింది. 


ఆ టెస్ట్ లో ఆస్ట్రేలియా  విజయం సాధించిన తరువాత స్మిత్   సహచరులతో  కలిసి  ఫుల్ గా ఎంజాయ్ చేశాడు. ఈక్రమంలో   స్మిత్  కళ్లద్దాలు ధరించి ఇంగ్లాండ్ ఆటగాడు జాక్ లీచ్ ను  అనుకరించి నానా హంగామా చేశాడు ,. దాంతో స్మిత్ చేసిన పనికి  సోషల్ మీడియా లో  ప్రతీకారం తీర్చుకున్నారు ఇంగ్లాండ్ అభిమానులు.  స్మిత్ నువ్వు ఇక మారవా .. నువ్వు ఎప్పటికి  చీటర్ వే .. లీచ్ , స్టోక్స్ తో కలిసి  3 వ టెస్ట్ గెలిపించాడు ,అతను నీలా చీటర్ కాదు అని స్మిత్  ఫై దుమ్మెత్తి పోస్తున్నారు. 



ఇక ఈ సిరీస్ లో  చివరి మ్యాచ్  గురువారం నుండి ప్రారంభం కానుంది.  అన్ని విభాగాల్లో  ఆసీస్ పటిష్టంగా ఉండగా  ఇంగ్లాండ్ మాత్రం సొంత గడ్డ ఫై  బలహీనంగా కనిపిస్తుంది.  ఒకవేళ ఈటెస్ట్ లో కనుక ఆసీస్ గెలిస్తే  3-1 తో యాషెస్ సిరీస్  ని కైవసం చేసుకొని  18ఏళ్ళ తరువాత ఇంగ్లాండ్ గడ్డ ఫై చరిత్ర సృష్టించనుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: