ఓవల్ వేదికగా జరిగిన యాషెస్ చివరి టెస్ట్ లో ఇంగ్లాండ్ , ఆసీస్ ఆటగాళ్లు  నియంత్రణ కోల్పోయి  ఒకరిని ఒకరు తీవ్రపదజాలంతో  దూషించుకున్నారు. అందులో  భాగంగా మూడో రోజు లంచ్  సమయంలో  ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ను  ఉద్దేశిస్తూ  ఇంగ్లాండ్ అల్ రౌండర్  బెన్ స్టోక్స్ అసభ్యకరమైన  పదజాలంతో  దూషించాడు. 



ఇక ఆతరువాత ఇంగ్లాండ్ బ్యాటింగ్ చేస్తున్న క్రమంలో  క్రీజ్ లో వున్న కెప్టెన్ రూట్ దగ్గరకు వెళ్లి  ఆసీస్ వికెట్ కీపర్  వేడ్  స్లెడ్జింగ్  కు పాల్పడ్డాడు. బదులుగా   రూట్ కూడా అతడి ఫై  మాటల దాడి చేశాడు.  ఈవివాదం పెద్దదవుతుతున్న క్రమంలో  పైన్ కల్పించుకొని  సద్గుమణిగించాడు.  ఆతరువాత నాలుగో రోజు   వేడ్ స్ట్రైకింగ్ లో ఉండగా  ఇంగ్లాండ్ కీపర్  జానీ బెయిర్ స్టో  బూతు మాటను ఉపయోగించి దూషణలు చేశాడు.  బెయిర్ స్టో వాడిన ఆ అసభ్య పదజాలం స్టంప్ మైక్ లో రికార్డు అయ్యింది.  కాగా  ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా ఫై  ఇంగ్లాండ్ 135 పరుగుల భారీ తేడాతో గెలిచింది. ఫలితంగా  5మ్యాచ్ ల సిరీస్ ను 2-2 తో డ్రా చేసుకుంది. అయితే గత యాషెస్ సిరీస్  ను ఆస్ట్రేలియా గెలుచుకోగా .. ఈసారి డ్రా కావడంతో యాషెస్ ట్రోఫీ ని మళ్ళీ ఆసీసే అంటిపెట్టుకుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: