ప్రొ కబడ్డీ లీగ్‌లో ప్లేఆఫ్ ఆశల్ని ఇప్పటికే సంక్లిష్టం చేసుకున్న తెలుగు టైటాన్స్ సోమవారం దబాంగ్ ఢిల్లీతో కఠిన పోరుకి సిద్ధమైంది. పుణె వేదికగా ఈరోజు రాత్రి 8.30 గంటలకి మ్యాచ్ జరగనుండగా గత వారం నుంచి తనకంటే బలమైన జట్లకి షాకిలిచ్చిన దబాంగ్ ఢిల్లీ ఇప్పుడు అగ్రస్థానంలో ఉంది.


ఈ నేపథ్యంలో ఈరోజు తెలుగు టైటాన్స్‌ మ్యాచ్‌లో గెలవాలంటే శ్రమించాల్సిందే. ఒకవేళ ఓడితే ప్లేఆఫ్ రేసు ఆశలు వదలుకోవాల్సి వస్తుంది.టోర్నీలో 14 మ్యాచ్‌లాడిన తెలుగు టైటాన్స్ ఏకంగా 8 మ్యాచ్‌ల్లో ఓడి ప్లేఆఫ్ రేసుని సంక్లిష్టంగా మార్చుకుంది.


మిగిలిన ఆరింట్లో రెండింటిని టైగా ముగించిన టైటాన్స్ నాలుగు మ్యాచ్‌ల్లో గెలుపొందింది. దీంతో 30 పాయింట్లతో ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 11వ స్థానంలో కొనసాగుతోంది. 12 జట్లు పోటీపడుతున్న ఈ టోర్నీలో తెలుగు టైటాన్స్‌ తర్వాత స్థానంలో ఆఖరికిగా తమిళ్ తలైవాస్ (27) మాత్రమే ఉండటం గమనార్హం.దబాంగ్ ఢిల్లీ ఇప్పటికే ప్లేఆఫ్‌ బెర్తుని దాదాపు ఖాయం చేసేసుకుంది.


15 మ్యాచ్‌లాడిన ఢిల్లీ ఏకంగా 12 మ్యాచ్‌ల్లో గెలుపొంది ప్రస్తుతం 64 పాయింట్లతో నెం.1 స్థానంలో కొనసాగుతోంది. మిగిలిన మూడింట్లో ఒకదానిని టైగా ముగించిన ఢిల్లీ టీమ్ రెండింటిలో మాత్రమే ఓడింది. లీగ్ దశ ముగిసే సరికి టాప్-6లో నిలిచిన జట్లు ప్లేఆఫ్‌కి అర్హత సాధించనున్నాయి.


ఈరోజు జరగబోయే మ్యాచ్లో   తెలుగు టైటాన్స్ దబాంగ్ ఢిల్లీని నిలువరించి ప్లేఆఫ్ ఆశల్ని నిలబెట్టుకోఉంటుందో లేకపోతే ఇంటి దరి పడుతుందో ఈరోజు జరిగే మ్యాచ్లో తెలిసి పోతుంది.ఇప్పటి వరకు ఉన్న పాయింట్ల ప్రకారం 12 జట్లు వరుసగా ఇలా ఉన్నాయి. ముందుగా పాయింట్ల విధంగా చుస్తే దబాంగ్ ఢిల్లీ, బెంగాల్ వారియర్స్, హర్యానా స్టీలర్స్, బెంగళూరు బుల్స్, యు ముంబా, జైపూర్ పింక్ పాంథర్స్, యుపి యోధా, పాట్నా పైరేట్స్, గుజరాత్ ఫార్చ్యూన్జియంట్స్, పునేరి పాల్టన్, తెలుగు టైటాన్స్ మరియు తమిళ తలైవాస్ గా ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: