మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ యువ ఆటగాడయిన రిషబ్ పంత్ కి హెచ్చరిక లాంటీ సూచన చేశాడు. ఇటీవల రిషబ్ పంత్ ఆటతీరు బాగాలేదని, ఇలాగే కొనసాగితే టీంలో ఆయన స్థానానికి పెను ప్రమాదం పొంచి ఉందని పేర్కొన్నాడు. వికెట్ కీపర్ అయిన పంత్ ఆటని మార్చుకోకపోతే తనకి పోటీగా ఉన్న మరో వికెట్ కీపర్ సంజూ శాంసన్ ఆ ప్లేస్ లో కి వచ్చే అవకాశం లేకపోలేదని, అందుకే అవకాశాలని అందిపుచ్చుకోవడమే కాదు, నిరూపించుకోవడం చాలా ముఖ్యమని సుతిమెత్తగా హెచ్చరించాడు.


పంత్ లో టాలెంట్ ఉన్న మాట వాస్తవం. కానీ ఇటీవల ఆయన ప్రదర్శన అస్సలు బాగాలేదు. ఆటతీరు మార్చుకుని ముందుకు సాగితే ఆయన స్థానానికి ఎటువంటి ఢోకా ఉండదని, లేని పక్షంలో నా ఫేవరెట్ ఆటగాడయిన సంజూ శాంసన్ రూపంలో పంత్ కి పెన్ సవాల్ ఎ౦దురుకానుందని  పేర్కొన్నాడు. వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్ లో పంత్ ఆటతీరు ఆయన్ని తీవ్ర విమర్శలకు దారి తీసింది. గంభీర్ ఇక కేఎల్‌ రాహుల్‌, మనీష్‌ పాండే, శ్రేయస్‌ అయ్యర్‌ల గురించి మాట్లాడుతూ వారి ఆటరీరును ప్రశంసించాడు.


ముఖ్యంగా మనీష్ పాండే, శ్రేయాస్ అయ్యర్ ల కి తమ స్థానాలని నిలబెట్టుకోవడానికి మరొక అవకాశం దొరికిందని, ఈ అవకాశాన్ని వాళ్ళు సద్వినియోగం చేసుకుంటారని భావిస్తున్నానని అన్నాడు. దక్షిణాఫ్రికాతో జరిగే సిరీస్ లో వాళ్ళు బాగా ఆడితే తమ స్థానానికి ఎలాంటి ఢోకా ఉండదని చెప్పాడు. దక్షిణాఫ్రికాతో జరిగే ద్వైపాక్షిక సిరీస్ లో టీం ఇండియానే నా ఫేవరెట్ అని చెప్పుకొచ్చాడు.


ప్రస్తుతం ఉన్న దక్షిణాఫ్రికా ఉన్న టీం బలహీనంగా ఉందని, ప్రధాన ఆటగాళ్లయిన డుప్లెసిస్, ఆమ్లా, స్టెయిన్ లు అందుబాటులో లేకపోవడం వాళ్ళకి పెద్ద మైనస్ అని, ఆ ప్రభావం దక్షిణాఫ్రికాపై బాగా పడుతుందని అన్నాడు. ప్రధాన ఆటగాళ్ళు ఉంటే ఆట మరింత మజాగా ఉంటుందని, వాళ్ళు లేకపోవడం దక్షిణాఫ్రికా తీరని లోటని పేర్కొన్నాడు.



మరింత సమాచారం తెలుసుకోండి: