క్రికెట్లో బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్, కీపింగ్.. ఇలా ప్రతి విభాగంలో ఎప్పుడొకప్పుడు సరికొత్త రికార్డులు నమోదవుతూనే ఉంటాయి. క్రికెట్లో అప్పుడప్పుడే అడుగుపెట్టిన క్రికెటర్ కూడా రికార్డులు సృష్టించగలడు. కావల్సిందల్లా.. ఆటపై ప్రేమ, ఖచ్చితత్వం. అటువంటి రికార్డ్స్ ను క్రికెటర్లెందరో తమ పేరున లిఖించుకుని తమ దేశాలకు పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టారు. అలాంటి అరుదైన రికార్డునే మన స్టార్ క్రికెటర్, మిడిల్ ఆర్డర్ కింగ్ యువరాజ్ సింగ్ నెలకొల్పాడు.

 


ఐసీసీ ప్రతిష్టాత్మకంగా 2007లో నిర్వహించిన తొలి టీ20 ప్రపంచకప్ లో యువరాజ్ ఓ అరుదైన రికార్డు సృష్టించాడు. ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో స్టూవర్ట్ బ్రాడ్ బౌలింగ్ లో వరుసగా ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టి సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఈ సిక్సర్ల సునామీకి సెప్టెంబర్ 19తో సరిగ్గా 12 ఏళ్లు పూర్తయ్యాయి. అసలే తొలి టీ20 ప్రపంచకప్ కూడా కావడంతో ఈ రికార్డు క్రికెట్ చరిత్రలోనే కాకుండా, యూవీకి, భారత్ కు కూడా ఓ మధుర జ్ఞాపకంగా మిగిలిపోయింది. నిజానికి ఈ సునామీకి ముందు యూవీ మామూలుగానే ఆడుతున్నాడు. ఇంగ్లండ్ బౌలర్ ఫ్లింటాఫ్ తన నోటి దురుసుతో యూవీతో ఈ సిక్సర్ల ఓవర్ కు ముందే గొడవపడ్డాడు. దీంతో యూవీకి వచ్చిన కోపానికి తర్వాత ఓవర్ వేస్తున్న స్టూవర్ట్ బ్రాడ్ బలైపోయాడు. వేసిన ప్రతి బాల్ ను వైవిధ్యమైన షాట్లతో, తన బ్యాటింగ్ స్టైల్ తో సిక్సర్లు గా మలిచాడు.

 


సిక్సర్లు కొట్టే ప్రతి బాల్ ముందు యూవీని చూస్తే ‘గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస’ అనే సినిమా డైలాగ్ గుర్తురాక మానదు. యువరాజ్ సింగ్ పేరు విన్నా, ఫోటో చూసినా.. తన సిక్సర్ల సునామీ మాత్రమే గుర్తొచ్చేటంత ఇంపాక్ట్ భారతీయుల్లో కలిగించాడంటే అతిశయోక్తి కాదు.

 


మరింత సమాచారం తెలుసుకోండి: