అతడు మైదానంలోకి   వస్తే బాల్ ని ఆకాశంలో చూడాల్సిందే. అతను కొట్టిన బంతులు స్టేడియం బయటకి దూసుకెళ్లిన సందర్భాలు ఎన్నో . అతనెప్పుడూ మిస్టర్ కూల్. ఎవరు ఎంత అగ్రెసివ్ గా బిహేవ్  చేసిన అతను మాత్రం కూల్  గానే సమాధానం చెప్తాడు. ఇండియాకి రెండు ప్రపంచ కప్పులు అందించిన మిస్టర్ కూల్ కెప్టెన్.  తన వ్యూహాలతో మ్యాచ్  గెలుపు తీరాల వైపు నడిపించే మాస్టర్ మైండ్  అతని సొంతం . క్లిష్ట పరిస్థితుల్లో బ్యాట్  జులిపించి  ఎన్నో విజయాలను అందించిన యోధుడు. అతనే మిస్టర్ కూల్ మహేంద్రసింగ్ ధోని. 

 

 

ధోని కి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఒకసారి ధోనీ క్రీజులోకి అడుగుపెడితే అభిమానులకు వచ్చే కిక్కే వేరప్పా. ధోనిని  చూస్తే చాలు అభిమానులు ఉర్రూతలూగిపోతారు . ధోని కొట్టే కనువిందైన షాట్లతో  మైమరచిపోతారు. మిస్టర్ కూల్ కెప్టెన్ గా ఇండియాకి 2 వరల్డ్ కప్ లు  అందించి ధోని  ఎంతో ఘనత సాధించాడు. మొన్న జరిగిన ప్రపంచకప్ తర్వాత బిసిసిఐ  అనుమతితో ధోని  కాస్త బ్రేక్ తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ధోని ఎప్పుడు ఎప్పుడు గ్రీస్ లో అడుగు పెడతాడా అని అభిమానులు కళ్ళు కాయలు కాసేలా చూస్తున్నారు. కాగా విండీస్ టూర్ కి దూరమైన ధోని ... తాజాగా ఇండియా లో జరుగుతున్న సౌత్ ఆఫ్రికా సిరీస్ కి  కూడా దూరంగానే ఉన్నారు. అంతేకాకుండా సెప్టెంబర్లో జరిగే విజయ్ హజారే ట్రోఫీకి... నవంబర్ లో జరిగే బంగ్లాదేశ్ సిరీస్కు కూడా ధోని దూరం అవుతాడనే   సమాచారం. దీంతో ఇది ధోని అభిమానులకు ఒక బ్యాడ్ న్యూస్ అని చెప్పవచ్చు. అయితే చాలా రోజుల తర్వాత ధోనీ మళ్లీ మైదానంలోకి చూడొచ్చని వెయిట్ చేస్తున్న  అభిమానులకి  ఇది ఒక  నిరాశపరిచే వార్త  అనే చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: