టెస్ట్‌ క్రికెట్‌ ఓపెనర్‌గా రోహిత్‌ హిట్‌ అవుతాడా..? ఓపెనర్‌గా హిట్‌మ్యాన్‌ ప్రయోగం బెడిసికొడుతుందా..?  రెడ్‌ బాల్‌ క్రికెట్‌లో కత్తి మీద సాము లాంటి ఓపెనింగ్‌ బ్యాటింగ్‌ విషయంలో రోహిత్‌ నెగ్గుకొస్తాడా.. లేదా అనేది అనుమానం.  ఆ అనుమానాలన్నింటికి తన బ్యాట్‌తోనే సమాధానం చెప్పాడు రోహిత్‌. ఓపెనర్‌గా బరిలోకి దిగినే ఫస్ట్‌ టెస్ట్‌లోనే సెంచరీతో దుమ్మురేపాడు. 


క్రికెట్‌లో ఎవరు చేయాల్సిన పని వారే చేయాలి. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఎడాపెడా ప్రయోగాలు చెసేయొచ్చు కానీ టెస్ట్‌ క్రికెట్‌లో స్పెషలైజేషన్‌కే పెద్ద పీట వేయ్యాలి. ఐదు రోజుల ఆటలో పార్ట్‌ టైం వ్యవహారాలు పనిచేయవు. టెస్టుల్లో ఓపెనింగ్‌ అంత ఈజీ కాదు. ఇలా రోహిత్‌పై మాజీ క్రికెటర్లు చేసిన వ్యాఖ్యలు. వాటన్నింటికి వైజాగ్‌ టెస్ట్‌లో సమాధానం చెప్పాడు రోహిత్‌. అద్వితీయ బ్యాటింగ్‌తో మరోసారి తనెంటే  ఏంటో నిరూపించాడు.


వైజాగ్‌లో తన బ్యాటింగ్‌ పవరెంటో చూపించాడు ఈ ముంబై బ్యాట్స్‌మెన్‌. చూడచక్కని షాట్ లతో, తనకే సాధ్యమయ్యే సిక్సులతో అభిమానులను అలరించాడు. ఓపెనర్‌గా బరిలోకి దిగిన తొలి మ్యాచ్‌లోనే శతకం బాదేశాడు. తనపై ఉన్న అనుమానాలన్నింటిని పటాపంచాలు చేశాడు. రెడ్‌ బాల్‌ క్రికెట్‌ రోహిత్‌కిది నాలుగో సెంచరీ. ఈ ఇన్నింగ్స్‌ ఆరంభంలో నెమ్మదిగా ఆడిన రోహిత్‌.. వీలు చిక్కినప్పుడల్లా బంతిని బౌండరీకి తరలించాడు.


రోహిత్‌ శర్మ ఎప్పుడూ ఒక మిస్టరీనే. జోరుమీదున్నప్పుడు ఔరా అనిపించినట్టే.. తడబడినప్పుడు ఉసూరుమనిపిస్తాడు. సమస్యేమిటంటే తడబడే సందర్భాలే ఎక్కువగా ఉంటాయి. బౌలర్లు అతన్ని ఔట్‌ చేసిన సందర్భాల కన్నా  తనంతట తానే వికెట్‌ సమర్పించుకున్నవే ఎక్కువ ఉంటాయి. రోహిత్‌ తనకున్న అపారమైన టాలెంట్‌కు పూర్తి న్యాయం చేయట్లేదనే చెప్పాలి. ఆరేళ్ళ సాదాసీదా వన్డే కెరీర్‌ తర్వాత.. 2013లో ఓపెనర్‌గా ప్రమోషన్‌ రావడంతో అతని దశ తిరిగింది. సేమ్‌ టు సేమ్‌ టెస్ట్‌ క్రికెట్‌లోనూ మిడిలార్డర్‌ ఈ స్టైలిష్‌ బ్యాట్స్‌మెన్‌ రాణించలేదు. ఇప్పుడు టెస్టుల్లోనూ ఓపెనర్‌గా ప్రమోషన్‌ దక్కించుకున్నాడు. సెంచరీతో సత్తా చాటాడు.


లిమిటెట్‌ క్రికెట్‌లో రోహిత్‌ ఎంత ప్రమాదకరమైన బ్యాట్స్‌మెనో అందరీకీ తెలుసు. విజయనగరంలో దక్షిణాఫ్రికా జట్టుతో జరుగుతున్న ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో రోహిత్‌ ఓపెనర్‌గా దిగి సున్నాకే ఔటయ్యాడు. కానీ, ఇప్పడు సెంచరీతో అలరించాడు. రెడ్‌ బాల్‌ క్రికెట్‌లోనూ ఓపెనర్‌గా రోహిత్‌ సక్సెస్‌ అయితే.. టీమిండియాకు ఓ న్యూ ఇన్నింగ్స్‌ మేకర్‌ దొరికినట్టే.



మరింత సమాచారం తెలుసుకోండి: