వైజాగ్ లో దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్ లో అరుదైన ఫీట్ సాధించిన రోహిత్ శర్మ ను ఒకవైపు అందరూ  ప్రశంసల్లో ముంచెత్తుతుండగా ,  మైదానం లో సహచర ఆటగాడి పై నోరుపారేసుకున్న తీరుపై  మరొకవైపు  క్రీడా వ్యాఖ్యాతలు  విమర్శలు గుప్పిస్తున్నారు . దక్షిణాఫ్రికా తో జరిగిన తొలి టెస్టు మ్యాచ్ లో   భారత జట్టు ఘన విజయం సాధించింది.  భారత్ జట్టు విజయోత్సవ సంబరాలు చేసుకుంటుండగా , సోషల్ మీడియా రోహిత్ సహచర ఆటగాడు పుజారా ను దూషించిన వీడియో వైరల్ అవుతోంది .  


తొలి టెస్ట్ మ్యాచ్ లో   ఓపెనర్ గా  అవతారమెత్తిన రోహిత్ శర్మ,  రెండు ఇన్నింగ్స్ లో రెండు  శతకాలు బాది  అరుదైన ఫీట్ నమోదు చేసిన విషయం తెలిసిందే.  అయితే అదే రోహిత్ మైదానం లో   తన సహచర ఆటగాన్ని అభ్యంతరకమైన  పదజాలంతో దూషించడం హాట్ టాఫిక్ మారింది .  రెండవ ఇన్నింగ్స్ లో పుజారా తో కలిసి ఇన్నింగ్స్ నిర్మించే క్రమంలో రోహిత్ సింగిల్ కు రమ్మంటూ అతడ్ని   పిలిచాడు.  అయితే దానికి పుజారా నుంచి సరైన స్పందన లేకపోవడంతో రోహిత్ తిట్ల దండకం అందుకున్నాడు .  పుజారా ని ఉద్దేశించి అభ్యంతరకరమైన పదజాలాన్ని రోహిత్ ఉపయోగించినట్లు నాన్  స్ట్రైకింగ్ ఎండ్ స్టంప్  మైక్ లో రికార్డయింది.  ఇది తాజాగా వెలుగు చూడడం...   అంతలోనే సోషల్ మీడియా లో వైరల్ కావడం జరిగింది.  అయితే పూజారా ను రోహిత్  దూషించిన అంశాన్ని  టార్గెట్ చేస్తూ ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ ట్విట్టర్ లో తనదైన శైలిలో చమత్కరించాడు.


 ఈ సారి రోహిత్ సమయం ... విరాట్ ఇది కాదు ఆ తిట్లు ఏంటో నీకు తెలుసా?,  తెలిసే ఉంటుంది లే అంటూ అపహాస్యం చేశాడు .  గతంలో ఇంగ్లాండ్ తో  జరిగిన మ్యాచ్ సమయం లో కోహ్లీ కూడా  ఇలానే దూషించిన అంశాన్ని  స్ట్రోక్స్, ఈ సందర్బంగా  పరోక్షంగా గుర్తు చేశాడు. అయితే క్రికెట్ మైదానం లో ఇటువంటివన్నీ సర్వసాధారణమేనని క్రీడా పరిశీలకులు పేర్కొంటున్నారు .


మరింత సమాచారం తెలుసుకోండి: