దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్ట్ మ్యాచ్ లో రోహిత్ శర్మ అరుదైన రికార్డును నెలకొల్పాడు. విశాఖపట్నం లో జరిగిన ఈ మ్యాచ్ లో మన బౌలర్లు బంతితో, బ్యాట్ మెస్ బ్యాట్ తో చెలరేగిపోయారు. దీంతో విజయం చాలా తేలికగా లభించిందనే చెప్పాలి. అయితే ఈ మ్యాచ్ లో అందరి దృష్టిని ఆకర్షించిన ఆటగాడు రోహిత్ శర్మ. అంతవరకు టెస్టుల్లో ఓపెనర్ గా దిగని రోహిత్ శర్మ మొదటిసారిగా ఓపెనర్ గా వచ్చాడు. ఓపెనర్ గా వచ్చిన మొదటి మ్యాచ్ లోనే రెండు సెంచరీలు చేసి చరిత్ర సృష్టించాడు.


పరిమిత ఓవర్ల క్రికెట్ కే పరిమితం అనే అపవాదును పక్కకి నెట్టి తన బ్యాట్ తోనే విమర్శకులకు సమాధానమిచ్చాడు. చాలా రోజుల తర్వాత టెస్ట్ మ్యాచ్ లో సెహ్వాగ్ లాంటి ఆటగాడిని చూశామని నెటిజన్లు కామెంట్లు చేశారు. సీనియర్ ఆటగాళ్ళు సైతం రోహిత్ ఆటని ప్రశంసించారు. అయితే తాజాగా పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్  రోహిత్ ని ఆకాశానికెత్తేశాడు. రోహిత్ సెహ్వాగ్ కంటే మంచి ఆటగాడని కితాబిచ్చాడు.


సెహ్వాగ్ మైదానం నలువైపుల ఆడతాడు. కానీ టెక్నిక్ విషయంలో రోహిత్ సెహ్వాగ్ కంటే చాలా బెటర్. అతను ఆడే షాట్లలో ఎంతో వైవిధ్యం ఉంటుంది. 2013లో జిమ్ లో మొదటిసారి రోహిత్ ని కలిసినపుడు పేరేంటని అడిగితే రోహిత్ అని సమాధానమిచ్చాడు. అప్పుడే త్వరలో నీ పేరు ముందు "గ్రేట్" అనే పదం చేరుతుందని.. అది ఇన్నాళ్ళకి అయ్యిందని గుర్తు చేసుకున్నాడు.


రోహిత్ చాలా మంచి ఆటగాడని అప్పుడూ నమ్మాను. ఇప్పుడు కూడా నమ్ముతున్నానని చెప్పాడు. ఇక  రోహిత్ ని పాకిస్తాన్ మాజీ క్రికెటర్  ఇంజమాముల్ లో పోలుస్తూ... రోహిత్, భారత ఇంజమాముల్ హక్ అని, అతను ఓపెనర్ గా రావడంతో టీం ఇండియాలో పోటీ బాగా పెరిగిందని, మరి కొద్ది రోజుల్లో అతను నెంబర్ వన్ ఆటగాడిగా నిలుస్తాడని పేర్కొన్నాడు.



మరింత సమాచారం తెలుసుకోండి: