విశాఖపట్నం వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్ట్ మ్యాచ్ లో టీం ఇండియా ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో 203 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో మన ఆటగాళ్లందరూ బౌలింగ్ లోనూ, బ్యాటింగ్ లోనూ తమ అత్యుత్తమ ప్రదర్శనతో అదరగొట్టారు. అయితే ఈ మ్యాచ్ లో అందరినీ ఆకర్షించిన ఆటగాడు రోహిత్ శర్మ. హిట్ మ్యాన్ గా పిలవబడే రోహిత్ ఈ మ్యాచ్ లో మొట్టమొదటి సారి ఓపెనర్ గా ఆడి పలు రికార్డులు నెలకొల్పాడు.


ఓపెనర్ గా దిగిన మొదటి మ్యాచ్ లోనే రెండు సెంచరీలు చేసి తానేంటో నిరూపించుకున్నాడు. దీంతో ఆయన మీద ఉన్న విమర్శలు దూది పింజల్లా రాలిపోయాయి. పరిమిత ఓవర్లకి మాత్రమే ఆడగలడు అన్న అపవాదును ఈ మ్యాచ్ ద్వారా దూరం చేసుకున్నాడు. అయితే ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ కనబరిచిన అత్యుత్తమ ప్రదర్శన వల్ల టెస్ట్ ర్యాంకింగ్స్ లో అతని ర్యాంక్ చాలా మెరుగు పడింది. టెస్ట్ బ్యాట్ మెన్స్ లలో అతడు  పదిహేడవ ర్యాంకుకి ఎగబాకాడు. అప్పటి వరకు అతనికి చెప్పుకోదగ్గ ర్యాంక్ కూడా లేదు.


టెస్టుల్లో రోహిత్ శర్మకిదే అత్యుత్తమం. రోహిత్ ర్యాంకింగ్స్ లో పైపైకి వెళ్తుంటే కోహ్లీ మాత్రం తన పాయింట్లను కోల్పోయి కిందకి దిగజారాడు. కోహ్లీ ప్రస్తుతం 899 పాయింట్లతో రెండవ స్థానంలో కొనసాగుతున్నాడు. 2018 జనవరి తర్వాత 900 పాయింట్ల దిగువకి రావడం ఇదే తొలిసారి. అయితే ఇదే మ్యాచ్ లో డబల్ సెంచరీ చేసిన కుర్రాడు మయాంక్ అగర్వాల్ 38 స్థానాలు ఎగబాకి 25 వ స్థానంలో నిలిచాడు. దక్షిణాఫ్రికాతో జరగనున్న ఇంకా రెండు టెస్టులలో ఇంకెన్ని రికార్డులు నెలకొల్పుతారో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: