దేశవాళీ క్రికెట్‌లో సత్తాచాటుకుని అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టేవారు ఎక్కువగా నేర్చుకుంటున్నారు. వారు జాతీయ జట్టులో రావడానికి ఆలస్యం అవుతుంది.. కానీ మంచి నైపుణ్యాన్ని మాత్రం సాధిస్తున్నారు. మయాంక్‌ ఇలానే కష్టపడి జట్టులోకి వచ్చాడు' అని తెలిపాడు ప్రముఖ క్రికెటర్ హర్భజన్‌ సింగ్‌.విశాఖ టెస్టులో డబుల్ సెంచరీ చేసిన టీమిండియా టెస్ట్ ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌పై మాజీ ఆటగాళ్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా మాజీ క్రికెటర్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌, హర్భజన్‌ సింగ్‌ ప్రశంసలు కురిపించారు.

ఓ కార్యక్రమంలో వీవీఎస్ లక్ష్మణ్‌ మాట్లాడుతూ... 'సాధారణంగా దేశవాళీ క్రికెట్‌కు, అంతర్జాతీయ క్రికెట్‌కు ఆటగాళ్లు కొద్దిగా మార్పులు చేసుకొని ఆడుతారు. కానీ.. మయాంక్‌ ఎలాంటి మార్పు లేకుండా ధైర్యంగా అలానే ఆడాడు.మానసిక స్థెర్యం, స్థిరత్వం అతడి బలాలని.... ఆరాధ్య క్రికెటరైన సెహ్వాగ్‌లానే మయాంక్‌ ఆడుతున్నాడని అన్నాడు . మానసికంగా ఎంతో ధృడంగా ఉన్న కారణంగానే సునాయాసంగా షాట్లు కొడుతున్నాడు. అతను మెరుగైన క్రికెటర్‌' అని అన్నాడు.


మయాంక్‌ ఆట తీరు చాలా మెరుగ్గా ఉందని అతను సాధ్యమైనన్ని ఎక్కువ అవకాశాలు ఇవ్వాలని హర్భజన్‌ సింగ్‌ అన్నాడు. మయాంక్‌ ఫుట్‌వర్క్‌ చాల బాగుంటుందని... రివర్స్‌ స్వీప్‌ షాట్లు వేయడంలో తన ప్రతిభను చూపిస్తున్నాయన్నారు. జట్టు కోసం ఏం చేయాలో మయాంక్‌కు బాగా తెలుసని అతడిలో చాలా ప్రతిభ దాగుందని....   అందుకే బాగా రాణిస్తున్నాడని అన్నారు.మూడు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా విశాఖలో దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. బ్యాట్స్‌మెన్‌ విజృంభణకు తోడు బౌలర్ల కృషి తోడవ్వడంతో అచ్చొచ్చిన వైజాగ్‌ పిచ్‌పై భారత్‌ రెండో టెస్టు విజయాన్ని నమోదు చేసుకుంది.

చివరి రోజు పేసర్ మొహమ్మద్ షమీ (5/35), రవీంద్ర జడేజా (4/87) రాణించడంతో దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌లో 191 పరుగులకు ఆలౌటైంది.ఫలితంగా భారత్‌ 203 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుని 3 టెస్టుల ఫ్రీడమ్‌ సిరీస్‌లో 1-0తో ముందంజలో నిలిచింది.ఎలాంటి భయం లేకుండా మాజీ డాషింగ్‌ బ్యాట్స్‌మన్‌ వీరేందర్‌ సెహ్వాగ్‌లా మయాంక్‌ ఆడుతున్నాడని లక్ష్మణ్‌ పేర్కొన్నాడు. మయాంక్‌ ఫుట్‌వర్క్‌ చక్కగా ఉందని..... అలా ఆడటానికి అతని మానసిక బలమే కారణమన్నాడు.'దీనివల్లే సరైన షాట్లు ఆడుతున్నాడని' హర్భజన్‌ అన్నాడు


మరింత సమాచారం తెలుసుకోండి: