హైదరాబాద్ లో వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో అమెరికా జిమ్మాస్ట్‌ సిమోన్‌ బైల్స్‌ చరిత్ర సృష్టించింది. బైల్స్‌ తన అద్భుత ప్రదర్శనతో వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో అమెరికా వరుసగా ఐదోసారి టీమ్‌ స్వర్ణాన్ని కూడా సొంతం చేసుకుంది. టీమ్‌ ఆల్‌రౌండ్‌ ఈవెంట్‌లో అమెరికా జట్టు 172.330 పాయింట్లు స్కోరు చేసి అగ్రస్థానంలో నిలిచింది.
దీంతో బైల్స్‌ రికార్డు స్థాయిలో 15వ వరల్డ్‌ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణాన్ని తన సొంతం చేసుకుంది. ఇక రష్యా, ఇటలీ రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. మొత్తంగా వరల్డ్ ఛాంపియన్‌షిప్‌ చరిత్రలో బైల్స్‌కు ఇది 21వ స్వర్ణం కావడం చాల పెద్ద విశేషం. దీంతో రష్యాకు చెందిన ఖొర్కినా (20)ను వెనక్కి నెట్టి అత్యధిక ప్రపంచ టైటిళ్లు నెగ్గిన క్రీడాకారిణిగా అరుదైన ఘనత సాధించింది అని తెలుస్తుంది.


ఇక ఆల్‌టైమ్‌ రికార్డుకు(23) బైల్స్‌ కేవలం రెండు పతకాల దూరంలో ఉండడం గమనార్థకం. పురుషుల జిమ్నాస్టిక్స్‌లో 23 పతకాలు గెలిచిన విటలీ షెర్బో(బెలార్‌స) పేరిట ఈ ఆల్‌టైమ్‌ రికార్డు ఉంది. ఇదిలా ఉండగా, పురుషుల టీమ్‌లో జిమ్నాస్ట్ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌‌ను రష్యా జట్టు సొంతం చేసుకుంది. ఈ విభాగంలో రష్యాకు స్వర్ణం లభించడం ఇదే మొదటిసారి.


కాగా, ఇదే ఛాంపియన్‌షిప్‌లో భాగంగా రెండు రోజుల క్రితం ఫ్లోర్‌ ఈవెంట్‌లో ట్రిపుల్‌ డబుల్‌ చేసి సిమోన్ బైల్స్ అరుదైన రికార్డు దగించుకుంది. ఇక  వరల్డ్‌ ఆర్టిస్టిక్‌ చాంపియన్‌షిప్‌లో పోటీపడ్డ మొదటి రోజే అందరిని భారీ స్థాయిలో ఆకట్టుకుంది. గంటల వ్యవధిలో రెండు విన్యాసాలు చేసి అందరిని మయిమరిపించింది. ఫ్లోర్‌ ఎక్సర్‌సైజ్‌ క్వాలిఫికేషన్‌లో బైల్స్‌.. ట్రిపుల్‌-డబుల్‌ స్కిల్‌ను ప్రదర్శించింది.


ఇంకో  అద్భుత ప్రదర్శన కూడా చేసింది అది ఏమిటి అంటే శరీరాన్ని రెండుసార్లు బ్యాక్‌ ఫ్లిప్‌ చేస్తూ గాలిలోకి ఎగిరి కిందకు ల్యాండ్‌ అయ్యే క్రమంలో శరీరాన్ని రెండుసార్లు బ్యాక్‌ ఫ్లిప్‌ చేస్తూ మూడుసార్లు ట్విస్ట్‌ చేయడం చాల గమనార్థకం. అత్యంత అరుదైన, సాహసోపేతమైన ఈ అద్భుత విన్యాసాన్ని బైల్స్‌ ఆవిష్కృతం చేసి చరిత్ర సృష్టించింది బైల్స్. 


మరింత సమాచారం తెలుసుకోండి: