ఇరాన్ ప్రభుత్వం సరికొత్త చరిత్ర  నాంది పలికింది. ఇరాన్‌లో జరిగే ఫుట్‌బాల్‌ మ్యాచ్‌లను మైదానంలో ప్రత్యక్షంగా వీక్షించేందుకు గాను నాలుగు దశాబ్దాల తర్వాత మహిళలకు అనుమతి ఇచ్చింది. వాస్తవానికి ఇరాన్‌లో గత 40 ఏళ్ల నుంచి ఫుట్‌బాల్‌ స్టేడియాల్లోకి మహిళలకు ప్రవేశం లేదు అని అందరికి తెలిసిందే. 
మహిళల స్వేచ్ఛకు అడ్డుగా ఉన్న నిబంధనలను సవరించకపోతే ఇరాన్‌ను అంతర్జాతీయ ఫుట్‌బాల్‌ నుంచి బహిష్కరిస్తామని ఫిఫా హెచ్చరించడంతో మహిళా అభిమానులను సైతం స్టేడియాల్లోకి అనుమతించాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఈ విదంగా తెలియచేసింది. నేడు  ఇరాన్‌- కంబోడియా జట్ల మధ్య 2022 వరల్డ్‌కప్‌ క్వాలిఫయర్‌ మ్యాచ్‌ అజాదీ స్టేడియంలో ప్రారంభం కానున్నది.


ఇక ఈ క్వాలిఫయర్‌ మ్యాచ్‌లో ఇరాన్ మహిళలు చాల సందడి చేయబోతున్నారు. ఈ మ్యాచ్‌ టిక్కెట్లు ఆన్‌లైన్‌లో పెట్టిన గంటలోనే  అన్ని అయిపోయాయని... వేల సంఖ్యలో అమ్మాయిలు టికెట్లు కొన్నట్లు ఫిఫా తెలియచేసింది. ఫుట్‌బాల్‌ మ్యాచ్‌లను స్టేడియాలకు వెళ్లి చూడడానికి మహిళలకు కూడా అనుమతిస్తున్నట్టు ఇరాన్‌ ప్రభుత్వం ప్రకటించినందుకు ఆనందంలో ఉన్నారు.


టెహ్రాన్‌ మైదానంలో ప్రత్యక్షంగా సాకర్‌ మ్యాచ్‌లను చూసేందుకు నాలుగు దశాబ్దాలాగా  ఎదురుచూస్తున ఇరాన్‌ మహిళల నిరీక్షణకు మరి కొద్ది గంటల్లో తెరపడనుంది. ఇక అజాదీ స్టేడియంలో ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ కు పెద్ద సంఖ్యల మహిళలు వీక్షించండందుకు తరలి రాబోతున్నారు. ఈ మ్యాచ్‌ టిక్కెట్లు ఆన్‌లైన్‌లో పెట్టిన గంటలోనే అయిపోయాయని..కొనుగోలు చేసిన వారిలో స్త్రీలే అధికంగా ఉన్నారని ఫిఫా  కూడా తెలిపింది. 


ఇక మొత్తానికి  2022 ప్రపంచకప్ క్వాలిఫయర్ మ్యాచ్లో మహిళలు సందడి చేయబోతున్నారు. మహిళల స్వేచ్ఛను గురించి ఆలోచన చేసి మంచి నిర్యాణం తీసుకుంది అని ఫిఫా తెలియచేసింది. ఇక  ఫుట్‌బాల్‌ స్టేడియాల్లో మహిళలు రంగ ప్రవేశంతో భారీ స్థాయిలో జరగబోతుంది ఈ సంవత్సరం మ్యాచ్.


మరింత సమాచారం తెలుసుకోండి: