టీం ఇండియా జెర్సీ పై ఇప్పుడు ఒక ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది.2019 వరల్డ్ కప్ లో పాల్గోన్న టీమ్ ఇండియా జెర్సీ పై  ఒప్పో బ్రాండ్ కనిపిస్తున్న విషయం తెలిసిందే అయితే ఇక నుంచి ఆ జెర్సీపై ఒప్పో బ్రాండ్ పోయి ఆ స్థానంలో ఇక నుంచి స్వదేశీ ఆన్ లైన్ ట్యుటోరింగ్ సంస్థ బైజూస్ పేరు కనిపించనుంది.

రెండు వేల పదిహెడు మార్చి లో టీమిండియా జెర్సీపై  బ్రాండ్ హక్కులన ఒప్పో సంస్థ రూ ఒక వెయ్యి డెబ్బై తొమ్మిది కోట్లకు దక్కించుకుంది అయితే ఐదేళ్ల పాటు టీమిండియా జెర్సీపై ఒప్పో బ్రాండ్ కనిపించేలా ఒప్పందం చేసుకుంది. ఇంకా కాలవ్యవధి ఉన్నప్పటికీ అప్పు ఈ ఒప్పందం నుంచి తప్పుకున్నట్లు తెలిసింది ఎందుకనగా బెంగుళూరుకు చెందిన ఎడ్యుకేషనల్ యాప్స్ బైజూస్ ఈ హక్కులను ఒప్పో నుంచి సొంతం చేసుకున్నట్లు తెలిసింది.

ఈ ఒప్పో బ్రాండ్ కేవలం వెస్టిండీస్ టూర్ వరకు మాత్రమే టీమిండియా జెర్సీ పై కన్పించనుంది సెప్టెంబర్ లో దక్షిణాఫ్రికా టూర్ మొదలయ్యేనాటికే టీమిండియా జెర్సీ పై బైజూస్ యాప్ బ్రాండ్ కన్పించనుంది. ఒప్పందం ప్రకారం రెండు వేల ఇరవై రెండు మార్చి ముప్పై ఒకటి వరకు ఈ బ్రాండ్ టీమిండియా జెర్సీపై ఉండనుంది స్మార్ట్ ఫోన్ మార్కెట్ లో బడ్జెట్ ఫోన్ ల హవా మొదలవడంతో ఒప్పో నష్టాల్లోకి పోయింది. దీంతో ఒక మెట్టు దిగి బడ్జెట్ ఫోన్ లను కూడా ఒప్పో ప్రవేశపెట్టినప్పటికీ ఆశించిన ఫలితాలు రాలేదు దీని వల్ల జెర్సీపై ఒప్పందాన్ని ఒప్పో వదులుకోక తప్పలేదు.

బిసిసిఐకి బైజూస్ యాప్ ఒప్పో చెల్లించినంత మొత్తాన్ని చెల్లించనుంది తెలుగులో మహేశ్ బాబు బాలీవుడ్ లో షారుక్ ఖాన్ వంటి అగ్ర నటులను బ్రాండ్ అంబాసిడర్స్ గా పెట్టుకొని ప్రచారం చేస్తోందంటే బైజూస్ యాప్ యొక్క గొప్పతనం మరియు అది ఎంత లాభాలు గడుస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఎనిమిదేళ్ల క్రితం స్థాపించిన బైజూస్ కంపెనీ ఆన్ లైన్ ఎడ్యుకేషన్ రంగంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికింది.


మరింత సమాచారం తెలుసుకోండి: