వేసవి కాలం రానే వచ్చేసింది. ఇక సూర్యభగవానుడు భగభగ మంటున్నాడు. ఎండ వల్ల పుట్టే వేడి నుంచి ఉపశమనం కోసం ఏసీ వాడకం తప్పనిసరి. అయితే వేసవిలో రోజులతరబడి  ఏ సీ వేసుకుంటే విద్యుత్ బిల్లులు భారీగానే వస్తాయి, మరోవైపు  ఏసీ పని చేసే శక్తి,  సామర్థ్యం కూడా తగ్గుతుంది. అయితే కొన్ని సింపుల్ ట్రిక్స్ పాటించడం వలన ఏసీకి  వున్న విద్యుత్ బిల్లు భారీగా రాకుండా ఉండేందుకు వీలు ఉంటుంది. అది ఎలానో చూద్దాం.

1). ఈ సంవత్సరం ప్రారంభంలో, బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ (BEE) ఏ సీ తయారీదారులకు సూచన చేసింది. తాము తయారు చేసినటువంటి ఏసీ పరికరాలలో డిఫాల్ట్ ఉష్ణోగ్రత ను 24. C వద్ద ఉంచాలని ఆదేశించింది. ఈ ఆదేశాలకు ముందు ఏసీలో డిఫాల్ట్ 20 డిగ్రీలు ఉండేది. అయితే ఏసీ ఉష్ణోగ్రతను పెంచే ప్రతి డిగ్రీ కి 6 శాతం విద్యుత్ ఆదా అవుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే ఏసీను ఎప్పుడూ 24 నుంచి 26 మధ్య నే ఉంచితే రూ. 300 వరకు బిల్లు తగ్గుతుంది.కనుక వినియోగదారుడు ఏసీ డిఫాల్ట్ భద్రతలు పెట్టుకుంటే 24 శాతం విద్యుత్తును ఆదా చేయవచ్చు.

2). అయితే ఢిల్లీ,చెన్నై, ముంబై వంటి నగరాల్లో నివసిస్తూ ఉంటే అక్కడ సగటు ఉష్ణోగ్రత 34 డిగ్రీస్C-38 డిగ్రీల C మధ్య ఉంటుంది. కనుక వినియోగదారులు చేసిన పది డిగ్రీల కంటే తక్కువకె అమర్చడం సౌకర్యవంతంగా ఉంటుంది. ఎందుకంటే మన శరీర ఉష్ణోగ్రత సగటు 36 - 37 డిగ్రీల మధ్య ఉంటుంది.

3). ముఖ్యంగా ఏసీ ఎలా వాడాలో తెలుసుకోవాలి. ఏసీ వేసుకోవడానికి ముందు రూమ్లో చల్లదనాన్ని గ్రహించే వస్తువులు లేకుండా చూసుకోవాలి. కిటికీలు మూసి వేయాలి. ఎండ, వేడి రూమ్ లోకి రాకుండా చూసుకోవాలి. మన ఇళ్లలో వాడే ఫ్రిడ్జ్ , ఎలక్ట్రానిక్ వస్తువులు ఏవైనా ఆఫ్ చేసి ఉంచాలి. కొద్దిసేపు కూల్ అయిన తర్వాత అప్పుడు వాటిని తిరిగి ఆన్ చేసుకోవచ్చు.

4).ఒక రోజంతా ఏసీ ఆన్ చేసి ఉంటే కనుక రాత్రిపూట ఎక్కువసేపు ఆన్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. కేవలం రెండు గంటలు ఏసీని వేసుకుంటే రూమ్ అంతా చల్లబడుతుంది. ఇలా చేయడం ద్వారా విద్యుత్ ఆదా చేసుకోవచ్చు.

5). ఇక కొంతమంది అయితే రూమ్ లో ఏసీ వేసుకున్నా సీలింగ్ ఫ్యాన్ ని, ట్యూబ్ లైట్  కూడా వేసుకుంటారు. అలా వేసుకోవడం ద్వారా గది ఉష్ణోగ్రత తగ్గదు.  త్వరగా చల్లబడదు.

6). ముఖ్యంగా ఏసీ వాడకంలో  తగు జాగ్రత్తలు తీసుకోవాలి.ఏసీ ఎప్పటికప్పుడు శుభ్రపరచాలి. దుమ్ము, ధూళి ఉంటే ఏసీ పనిచేసే శక్తి సామర్థ్యం తగ్గుతుంది. ఏసీ లో ఫిల్టర్ ను ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. దీంతో విద్యుత్ వినియోగం 5 నుంచి 15 శాతం వరకు తగ్గుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: