వాచ్ అనేది అప్పటి రోజుల్లో టైమ్ చూసుకోవడానికి వాడేవారు.. రాను రాను అది స్టైల్ గా కూడా మారింది. ఇప్పుడు మాత్రం వాచ్ తో వంద ఉపయోగాలు ఉన్నాయని అంటున్నారు. యువత స్మార్ట్ వాచ్ ల వైపు పరుగులు పెడుతున్నారు. వారి అంచనాలకు రీచ్ అయ్యేలా కంపెనీలు కూడా సరికొత్త ఫీచర్లతో మార్కెట్ లోకి స్మార్ట్ వాచ్ లను విడుదల చేస్తున్నారు. తాజాగా, హువామి సంస్థ అమేజ్‌ఫిట్ బిప్ యు ప్రో స్మార్ట్వాచ్ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ స్మార్ట్వాచ్ గతేడాది విడుదలైన అమేజ్‌ఫిట్ బిప్ యుకు కొనసాగింపుగా వస్తోంది. గతేడాది విడుదలైన అమేజ్ఫిట్ బిప్ యు ధర రూ.3,499 ఉండగా, తాజాగా విడుదలైన అమేజ్ఫిట్ బిప్ యు ప్రో రూ .4,999లకు లభిస్తుంది.


అమేజ్ఫిట్ బిపి యు ప్రో స్మార్ట్వాట్ మిడ్‌రేంజ్ స్మార్ట్‌వాచ్గా మార్కెట్ లోకి లాంఛ్ అయ్యింది. అమేజ్‌ఫిట్ బిప్ యు ప్రో ఇప్పటికే హువామి అధికారిక వెబ్‌సైట్, అమెజాన్‌ సైట్లో అమ్మకానికి లిస్ట్ చేయబడింది. ఇది మొత్తం మూడు కలర్ వేరియంట్లలో లభించనుంది. ఈ స్మార్ట్వాచ్లో అద్భుతమైన ఫీచర్లను చేర్చింది. అమాజ్‌ఫిట్ బిప్ యు ప్రోలో 1.43- అంగుళాల ఐపిఎస్ ఎల్‌సిడి డిస్‌ప్లే, 2.5 డి గొరిల్లా గ్లాస్ యాంటీ ఫింగర్ ప్రింట్ కోంటింగ్ని అందించింది..


హార్ట్ రేట్ మానిటరింగ్ కోసం దీనిలో ఆప్టికల్ హార్ట్ రేట్ సెన్సార్, బ్లడ్ ఆక్సిజన్ సెన్సార్, ట్రై-యాక్సిస్ యాక్సిలెరోమీటర్, ట్రై-యాక్సిస్ గైరో, జియో మాగ్నెటిక్ వంటి సెన్సార్‌లను జోడించింది. అమేజ్‌ఫిట్ బిప్ యు స్మార్ట్వాచ్తో పోలిస్తే ప్రో స్మార్ట్వాచ్లో అప్డేటెడ్ ఫీచర్లను అందించింది. దీనిలో బిల్ట్ ఇన్ జిపిఎస్, అలెక్సా వాయిస్ అసిస్టెంట్ అనే కొత్త ఫీచర్లను చేర్చింది.అమేజ్‌ఫిట్ బిప్ యు ప్రోతో సహాయంతో మీ ఫోన్లో వచ్చే నోటిఫికేషన్లను ఎప్పటికప్పుడు చూసుకోవచ్చు. అంతేకాక, మ్యూజిక్ కంట్రోల్ చేయవచ్చు. మీ ఫోన్‌ లొకేషన్ను కూడా తెలుసుకోవచ్చు. ఇది బ్లూటూత్ 5.0, 230 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో పనిచేస్తుంది. కేవలం రెండు గంటల్లో ఈ స్మార్ట్వాచ్ను ఫుల్ ఛార్జ్ చేయవచ్చు.. వాడేదాన్ని బట్టి ఛార్జ్ ఉంటుంది.. మాములుగా వాడితే 9 రోజులు, కాస్త ఎక్కువగా వాడితే 5 రోజుల వరకు మాత్రమే వస్తుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: