మీరు వాడుతున్న స్మార్ట్ ఫోన్లు పాత మోడల్ కు సంబంధించినవా? ఇక వీటిని వాడుతున్నప్పుడు చాలా స్లో గా ఉన్నాయా? అయితే ఇప్పుడు చెప్పబోయే సింపుల్ టిప్స్ తో, మీ పాత స్మార్ట్ఫోన్ల  స్పీడ్ తో పాటు పెర్ఫార్మన్స్ ను కూడా పెంచుకోవచ్చు. మీ పాత స్మార్ట్ఫోన్లలో స్పీడ్ ను ఎలా పెంచుకోవాలో? ఆ సూపర్ టిప్స్, ట్రిక్స్ ఏమిటో? ఇప్పుడు ఒకసారి చూద్దాం..


ఫోన్ రీస్టార్ట్ చేయడం :
అన్ని ఫోన్లకు ఇది ఒక సింపుల్ ట్రిక్ అని చెప్పవచ్చు. ఫోన్ రీస్టార్ట్ చేయడం. ఇలా చేయడం వల్ల బ్యాక్ గ్రౌండ్ లో మెమొరీ క్లీన్ అవుతుంది. అంతేకాకుండా ఏవైనా యాప్స్ స్టక్ అయినప్పుడు అవి కూడా ఫిక్స్ అవుతాయి.అయితే ఇందుకోసం మీ ఫోన్ యొక్క పవర్ బటన్ ను, రీసెట్ ఆప్షన్ కనిపించేంత వరకు నొక్కి పట్టాలి. అప్పుడు రీసెట్ ఆప్షన్ కనిపించగానే ఫోన్ రీస్టార్ట్ అవుతుంది.

క్యాచీ క్లియర్ చేయడం :
మీ ఫోన్లో  ఎప్పటికప్పుడు క్యాచీ క్లియర్ చేస్తుండండి. క్యాచీ మెమొరీ అనేది ర్యామ్ పై ఎఫెక్ట్ పడుతుంది. దాంతో స్పీడు తగ్గుతుంది. ఇలా అయినప్పుడు ఫోన్ స్లో గా పనిచేస్తుంది. ఇందుకోసం సెట్టింగ్స్ - స్టోరేజ్ - క్యాచీ ఆప్షన్ దగ్గరకు వచ్చి క్లియర్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయగానే క్యాచీ మెమొరీ క్లియర్ అవుతుంది.


యానిమేషన్స్ డిసేబుల్ :
విజువల్ ఎఫెక్ట్స్, యానిమేషన్ ఎనేబుల్ అయితే కూడా ఫోన్ స్లో అయిపోతుంది. మెమొరీని కూడా లాగేస్తాయి. అందుకే యానిమేషన్స్ మొత్తం కంప్లీట్ గా టర్న్ ఆఫ్ చేయండి. సెట్టింగ్స్ - అబౌట్ ఫోన్ - బిల్డ్ నెంబర్ పై పలుమార్లు క్లిక్ చేయండి. మీకు డెవలపర్ ఆప్షన్ కనిపించేంత వరకు అలాగే ట్యాప్ చేయండి. ఆ తర్వాత ఆనిమేషన్ ఆఫ్ చేస్తే సరిపోతుంది.

యాప్స్ రిమూవ్ :
మీ ఫోన్ లో అనవసరమైన యాప్స్ ను రిమూవ్ చేయండి. ఈ యాప్ వల్ల ఫోన్ మెమొరీ నిండిపోతుంది. ఇక రెగ్యులర్ గా వాడే యాప్స్ ను ఎప్పటికప్పుడు అప్డేట్ అయ్యేలా చూసుకోవాలి. లేటెస్ట్ వెర్షన్ లో కి అప్డేట్ చేయడం ఎంతో ఉత్తమం. ఇలా చేయడం వల్ల యాప్స్ పర్ఫామెన్స్  కూడా అద్భుతంగా ఉంటుంది.


ఈ టిప్స్ ను పాటిస్తే మీ ఫోన్ స్పీడ్ పెరుగుతుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: