ఈమధ్య కాలంలో 5జీ టెక్నాలజీ పేరు బాగా మారు మొగిపోతుంది.అయితే దీనిపై రూమర్ ఒకటి గట్టిగా నడుస్తుంది. అదేంటంటే ఈ టెక్నాలజీ ఆరోగ్యానికి మంచిది కాదట.5జీ టెక్నాలజీ ద్వారా ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుంది అనే అవాస్తపు వార్తలను టెలికాం సంస్థల సంఘం సెల్యులర్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(సీఓఏఐ) కొట్టి పారేయడం జరిగింది.అవన్ని ఒట్టి పుకార్లని తెలపడం జరిగింది.ఈ 5జీ టెక్నాలజీ పూర్తిగా సురక్షితమని దీని వల్ల ఎటువంటి అనర్ధాలు ఏమి లేవని సీఓఏఐ స్పష్టం చేయడం జరిగింది. ఇప్పటి దాకా అందుబాటులో ఉన్న సైంటిఫిక్ ఆధారాలన్ని నెక్స్ట్ జనరేషన్ 5జీ టెక్నాలజీ సురక్షితమని చెబుతున్నట్టు పేర్కొనడం జరిగింది.ఇక 5జీ టెక్నాలజీ "గేమ్ ఛేంజర్" అని రుజువు చేస్తుందని సైంటిఫిక్ రిజన్ ద్వారా తెలిపడం జరిగింది.5జి టెక్నాలజీ ద్వారా ఆర్థిక వ్యవస్థకు, సమాజానికి ప్రయోజనం కలుగుతుందని చెప్పడం జరిగింది.ప్రముఖ దేశీయ టెలికాం కంపెనీలైన రిలయన్స్, భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్‌కు ఈ సంఘం ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే.


ఢిల్లీ హైకోర్టులో 5జీ టెక్నాలజీ విషయమై వేసిన కేసులో బాలీవుడ్ నటి జుహీ చావ్లాకు దిమ్మతిరిగే షాక్ తగిలిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సీఓఏఐ ఈ ప్రకటన జారీ చేయడం జరిగింది. టెలికాం టవర్ల నుంచి విలువడే ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్‌కు సంబంధించి  ప్రపంచంలో ఆమోదం పొందిన ప్రమాణాల కంటే మన దేశంలో విధించిన నియమ నిబంధనలు చాలా కఠినమైనవని తెలపడం జరిగింది."ఇండియాలో అనుమతించిన రేడియేషన్ ప్రపంచవ్యాప్తంగా అంగీకరించిన వాటిలో పదోవంతు అయినందువల్ల రేడియేషన్ వల్ల ప్రతికూల ప్రభావం పడుతుందన్న భయాలు ఇప్పుడు అనవసరం.


ఈ సరిక్రొత్త టెక్నాలజీ అందుబాటులోకి వచ్చినప్పుడల్లా ఇలా జరుగుతుంది" అని సీఓఏఐ డైరెక్టర్ జనరల్ ఎస్పీ కొచ్చర్ పీటీఐకి చెప్పడం జరిగింది. దేశంలో 5జీ వైర్‌లెస్ నెట్‌వర్క్‌లను ఏర్పాటు చేయడాన్ని సవాలు చేస్తూ బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ జూహి చావ్లా ఢిల్లీ హైకోర్టులో దావా వేసిన విషయం తెలిసిందే. ఆ విచారణ సమయంలో హైకోర్టు జూహి చావ్లాపై, ఇతర పిటిషనర్లపై రూ.20 లక్షల జరిమానా విధించడం జరిగింది. ఈ వ్యాజ్యం లోపం అనేది భూయిష్టమైనదని, న్యాయప్రక్రియ దుర్వినియోగమైందని, కేవలం ప్రచారం పొందేందుకే ఈ కేసు పెట్టినట్టుగా ఉందని ఢిల్లీ హై కోర్టు వ్యాఖ్యానించడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: