ఇండియా మార్కెట్లో హ్యుందాయ్ కంపెనీ సరికొత్త ఐ 20 ఎన్ లైన్ ఆవిష్కరించడం జరిగింది. ఈ కొత్త వేరియంట్ ఇప్పుడు బయట ఇంకా లోపలి భాగంలో అనేక మార్పులకు లోనవ్వడం జరిగింది. ఇక ఈ కొత్త హ్యుందాయ్ ఐ 20 ఎన్ లైన్ కార్ అద్భుతమైన డిజైన్ కలిగి అప్డేటెడ్ ఫీచర్స్ ఇంకా పరికరాలను కలిగి ఉంటుంది. ఇక ఈ కొత్త మోడల్ గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకోండి.ఇక కొత్త హ్యుందాయ్ ఐ 20 ఎన్ లైన్ బుకింగ్‌లు కూడా ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్రారంభమవ్వడం జరిగింది. కాబట్టి కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లు కంపెనీ వెబ్ సైట్ లో కాని కంపెనీ అధీకృత డీలర్‌షిప్‌లలో కాని బుక్ చేసుకోని కొనుక్కోవచ్చు.ఇక దీని డెలివరీలు కూడా త్వరలో ప్రారంభమవ్వడం జరుగుతుంది.ఇక హ్యుందాయ్ ఐ 20 ఎన్ లైన్ టైటాన్ గ్రే, ఫియరీ రెడ్, థండర్ బ్లూ, పోలార్ వైట్ ఇంకా రెండు డ్యూయల్ టోన్ బ్లాక్ రూఫ్‌తో పాటు ఫైరీ రెడ్ ఇంకా సాకేత్ థండర్ బ్లూ అనే ఆరు కలర్ ఆప్షన్లలో మనకు అందుబాటులో ఉంటుంది.కాబట్టి ఇది వాహనదారులను మరింత ఆకర్షించడంలో ఎంతగానో సహాయపడుతుంది.

ఈ కొత్త హ్యుందాయ్ ఐ 20 ఎన్ లైన్ దాని స్టాండర్డ్ మోడల్ కంటే కూడా చాలా భిన్నంగా కనిపిస్తుంది.ఇక ఈ మోడల్ ముందు ఇంకా వెనుక బంపర్‌కు స్పోర్టి లుక్ అనేది ఇవ్వబడుతుంది. అయితే ఫ్రంట్ గ్రిల్‌కు వేరే నమూనా ఇవ్వబడటం జరిగింది.ఇది ముందు ఇంకా వెనుక స్కర్ట్ అలాగే రియర్ బంపర్‌పై డిఫ్యూజర్‌ను కలిగి ఉంది.ఇక అలాగే ఈ కారుకి మరింత స్పోర్టి లుక్ ని ఇవ్వడానికి, వెనుక భాగంలో రెండు ఎగ్జాస్ట్ టిప్స్ అనేవి ఇవ్వబడటం జరిగింది.ఇక ఇది 16 ఇంచెస్ డ్యూయల్ టోన్ అల్లాయ్ వీల్స్‌తో ఫిక్స్ చెయ్యబడి ఉంటుంది. అందుకే ఇది కారుకి మరింత స్పోర్టి లుక్ ని ఇస్తుంది. అలాగే సేఫ్టీ కోసం ఇందులో అన్ని చక్రాలపై డిస్క్ బ్రేకులు అనేవి ఫిక్స్ చేయబడి ఉంటాయి.ఈ కార్ ధర కంపెనీ ఇంకా ప్రకటించలేదు. త్వరలోనే పూర్తి వివరాలు వెళ్లడవ్వడం జరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: