ఇండియా నెంబర్ వన్ ప్యాసింజర్ కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకి అందిస్తున్న స్విఫ్ట్ కారు అంటే మీకు చాలా ఇష్టమా? దాన్ని కొనాలనుకుంటున్నారా?ఒకవేళ మీరు గనుక ఆ కారుని కొనాలని చూస్తున్నట్లయితే, దాని సేఫ్టీ గురించి ఇప్పుడు మరొక్కసారి ఆలోచించండి.ఇండియాలోనే అత్యధికంగా అమ్ముడయ్యే టాప్ 5 చిన్న కార్లలో హీరో అనిపించుకునే మారుతి సుజుకి స్విఫ్ట్ కార్ , సేఫ్టీలో మాత్రం టోటల్ గా సుద్ద జీరో అనిపించుకుంది. ఇక ఈ కారు కోసం ఇటీవల లాటిన్ ఎన్‌క్యాప్ (Latin NCAP) క్రాష్ టెస్ట్‌లో ఇండియాలో తయారైన స్విఫ్ట్ కార్ 'సున్నా స్టార్ రేటింగ్' (Zero Rating)ను పొందడం జరిగింది.ఇక ఈ క్రాష్ పరీక్షలో వాడిన స్విఫ్ట్ కారుని ఇండియాలోని గుజరాత్ లో ఉన్న మారుతి సుజుకి ప్లాంట్ లో తయారు చేయడం జరిగింది. లాటిన్ ఎన్‌క్యాప్ క్రాష్ టెస్ట్‌లో ఇండియాలో తయారైన స్విఫ్ట్ వయోజన భద్రత విషయంలో 15.53 శాతం అలాగే పిల్లల భద్రత విషయంలో సున్నాగా రేట్ చేయబడింది.


ఇక అదే సమయంలో ఇది పాదచారులకు సంబంధించిన భద్రత విషయంలో 66 శాతం ఇంకా ఇతర భద్రతా లక్షణాల విషయంలో 7 శాతం రేటింగ్ ను పొందడం జరిగింది. ఇక లాటిన్ ఎన్‌క్యాప్ నివేదికలో, ఈ కారు పేలవమైన సైడ్ ఇంపాక్ట్ ప్రొటెక్షన్ ఇంకా పరీక్ష సమయంలో పేలవమైన డోర్ పనితీరు కోసం గాను స్విఫ్ట్ కి జీరో స్టార్ రేటింగ్ ఇవ్వబడటం జరిగింది.ఇక అంతే కాకుండా, ఈ కారు వెనుక ప్రభావ రక్షణ పనితీరు కూడా అంత సంతృప్తికరంగా లేదని ఈ నివేదిక పేర్కొనడం జరిగింది. స్విఫ్ట్ కారులో ప్రయాణీకుల హెడ్ ప్రొటెక్షన్ కోసం అందించే సైడ్ ఎయిర్‌బ్యాగ్‌లు కూడా ఇందులో లేవు ఇంకా దీనిని లాటిన్ ఎన్‌క్యాప్ పెద్ద లోపంగా పరిగణించడం జరిగింది.ఇక స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్లుగా స్విఫ్ట్ కారును 6 ఎయిర్‌బ్యాగ్‌లు ఇంకా ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC) తో అమ్మబడుతుందని, లాటిన్ అమెరికాలో అమ్మే మోడళ్లలో సైడ్ బాడీ ఇంకా హెడ్ ఎయిర్‌బ్యాగ్‌లు అలాగే ESC వంటి స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్లు కూడా లేవని లాటిన్ ఎన్‌క్యాప్ తెలిపడం జరిగింది.కాబట్టి స్విఫ్ట్ కారుని కొనేవారు అలోచించి కొనడం చాలా మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి: