మనం ఇప్పుడు ఎక్కువగా ఆన్లైన్లోనే ఎటువంటి వస్తువునైనా విక్రయ చేస్తున్నాం. అలాంటి ఈ - కామర్స్ దిగ్గజం సంస్థలలో అమెజాన్, ఫ్లిప్ కార్ట్ వంటి మంచి దిగ్గజ సంస్థలు అని చెప్పవచ్చు. అయితే ఇప్పుడు ఈ కామర్స్ దిగ్గజం సంస్థలలో ఒకటైన అటువంటి అమెజాన్ బ్రాండ్.. ఒక టీవీ ని విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఆ వివరాలను ఇప్పుడు ఒకసారి చూద్దాం.


ఈటీవీలో  సరికొత్త అదిరిపోయే ఫీచర్లతో త్వరలోనే మార్కెట్లోకి రాబోతున్న ట్లు అమెజాన్ సంస్థ వెల్లడించింది. ఇది అక్టోబర్ మాసంలో మార్కెట్లోకి రానున్నట్లుగా మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ముందుగా యూఎస్ఏలో విడుదలై , ఆ తర్వాత ఇండియాలో విడుదల అవుతున్నట్లు సమాచారం.


ఇక అమెజాన్ సంస్థ ఎన్నో సంవత్సరాల నుంచి తమ సొంత సాఫ్ట్వేర్ తోనే టీవీలను తయారు చేయాలని భావిస్తోంది. అందుచేతనే ఇప్పుడు కూడా తమ సొంత సాప్ట్ వేర్ తో ఈ టీవీ లో విడుదల చేయబోతున్నట్లు తెలుపుతోంది. ఇక ఈ టీవీ ఫీచర్స్ విషయాలను చూద్దాం.

అమెజాన్ టీవీ 55 ఇంచుల నుంచి 75 ఇంచుల మోడల్స్ వరకు లభించగలదు. ఇక ఈ టీవీ ని అలెక్సా కమాండ్ కంట్రోల్ తో పనిచేసే విధంగా తయారు చేస్తున్నట్లు తెలుపుతోంది. అంతేకాకుండా ఈ టీవీ చేసేందుకు వారికి రెండు సంవత్సరాల నుంచి అదే పని మీదే ఉన్నారట. దీనిని ఈటీవీ లో అమర్చేందుకు చైనా ఎలక్ట్రానిక్ కంపెనీ TCL సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నదట.

Tcl సంస్థ నుంచి ఈ అలెక్స కమాండర్ వ్యాల్యూమ్ ను అమెజాన్ భాగస్వామ్యంలో వినియోగించుకోవచ్చని తెలియజేస్తోంది. ఇక మనం ఎక్కడి నుంచి మాట్లాడినా కూడా ఈ అలెక్స స్పందిస్తుందని తెలియజేశారు.

అమెజాన్ టీవీ యొక్క ధర.. అతి తక్కువ ధరలకే లభించే విధంగా తయారు చేస్తున్నట్లు ఆ సంస్థ తెలుపుతోంది. ఇక అంతే కాకుండా ఫైర్ అనే సాఫ్ట్వేర్ ఆధారితమైన.. తోషిబా, ఇన్ సిగ్నేయా.. అనే పేర్లతో ఈటీవీ లను విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. అందుకోసం కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలియజేసింది.


మరింత సమాచారం తెలుసుకోండి: