సాధారణంగా మార్కెట్లో ఎన్నో రకాల కొత్త ఫోన్ లు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి.  ఎన్నో కొత్త ఫీచర్లతో వివిధ మొబైల్ కంపెనీలు వినూత్నమైన ఫోన్లను విడుదల చేస్తూ ఉంటాయి. కానీ మార్కెట్లోకి ఎన్ని మొబైల్స్ కొత్తగా వచ్చినప్పటికీ అటు యాపిల్ ఐఫోన్ కు సంబంధించిన ఒక కొత్త ఫోన్ మార్కెట్లో విడుదల అయింది అంటే చాలు..  ఇక మిగతా మొబైల్ అన్ని పక్కకు తప్పుకుంటాయి. ఆ రెంజ్ లో ప్రస్తుతం యాపిల్ ఐఫోన్ కి మార్కెట్ లో ఒక  బ్రాండ్ క్రియేట్ అయ్యింది.  ఎవరైనా వినియోగదారులు తమ వద్ద యాపిల్ ఐఫోన్ కలిగి ఉన్నారు అంటే..  ఇక తమ మొబైల్ లో ఏదో ఒక విధంగా అందరికీ చూపించడానికే ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ వుంటారు.



 అసలు విషయానికి వస్తే.. ఇటీవలే ఆపిల్ సరికొత్త 5g ఐఫోన్ 13 సిరీస్ను విడుదల చేస్తూ  వినియోగదారులందరికీ శుభవార్త చెప్పింది. ఇక వినియోగదారుల అభిరుచికి అనుగుణంగా ఉండేందుకు కొత్తగా గులాబీ రంగులో కూడా ఈ ఫోన్ ను అందుబాటులోకి తీసుకు రావడం గమనార్హం. అంతేకాదు ఇక ఈ ఐఫోన్ 13 సిరీస్ కి కెమెరా డిజైన్ కూడా ఎంతో అద్భుతంగా సరికొత్తగా ఉంది అని చెప్పాలి. అంతేకాదు సినిమాటిక్ మోడ్ ని కూడా కెమెరా లెన్స్ లో అమర్చి అందర్నీ మరింత ఆకర్షిస్తోంది. ఇకపోతే ఐఫోన్ 13 సిరీస్ కు సంబంధించి ఐఫోన్ మినీ.. ఐఫోన్ 13 ప్రో.. ఐఫోన్ 13 ప్రో మాక్స్ లను విడుదల చేసింది.  ఇటీవల అమెరికాలో ఇక ఈ కొత్త సిరీస్ ను విడుదల చేసింది. కాగా ఐఫోన్ 13 ఫీచర్స్ ఇలా ఉన్నాయి..


బ్యాటరీ  సామర్థ్యం: ఐఫోన్‌ 13 మినీ, ఐఫోన్‌ 13లు 5.4; 6.1 అంగుళాల డిస్‌ప్లే కలిగి ఎంతో ఆకర్షణీయంగా ఉంది. ఈ కొత్త సిరీస్ ఫోన్లు అన్నీ తాజా ఏ15 బయానిక్‌ ప్రాసెసర్‌తో అందుబాటులోకి వచ్చాయి . ఇదివరకు యాపిల్ కంపెనీ విడుదల చేసిన  ఐఫోన్‌ 12 ప్రోతో పోలిస్తే ఐఫోన్‌ 13 ప్రో మొబైల్స్ బ్యాటరీ గంటన్నర సమయం..  13 ప్రోమాక్స్‌ బ్యాటరీ రెండున్నర గంటలు సమయం ఎక్కువగా పనిచేయనుంది. ఇటీవలే విడుదలైన ఐఫోన్ 13 సిరీస్ ఫోన్ల మెమొరీ 128 జీబీ నుంచి మొదలవుతుంది.

ధర విషయానికి వస్తే  : ఐఫోన్‌ 13 ధర 699 డాలర్ల నుంచి ప్రారంభమవుతుంది. 13 ప్రో 999 డాలర్లు, 13 ప్రోమాక్స్‌  1099 డాలర్ల నుంచి ప్రారంభం అవుతుందట .

దేశీయంగా: ఈనెల 17 నుంచి కొత్తగా విడుదలైన ఐఫోన్ 13 సిరీస్  ప్రీ ఆర్డర్‌ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది.. 24 నుంచి పూర్తి స్థాయిలో ఈ ఫోన్లు  అందుబాటులోకి వస్తాయి. ఇక మన కరెన్సీలో వీటి ధర ఎంత అంటే... ఐఫోన్‌ 13 మినీ రూ.69,900, 13 రూ.79,900, 13 ప్రో రూ.1,19,900, 13 ప్రో మ్యాక్స్‌ రూ.1,29,900 నుంచి ప్రారంభం అవుతాయట.

మరింత సమాచారం తెలుసుకోండి: