కరోనా మహమ్మారి ప్రభుత్వం దృష్టిలో ఉంచుకొని దేశంలోనే మొదటిసారిగా స్మార్ట్ మొబైల్ తోనే ఓటింగ్ వినియోగాన్ని మొదలు పెడుతోంది తెలంగాణ ప్రభుత్వం. యాప్ సరిగ్గా పని చేస్తుందా లేదా అని పరీక్షించడానికి.. ఖమ్మం జిల్లాలో ఎలక్షన్లు నిర్వహించడం జరిగింది. ఇవి కేవలం డమ్మీ ఎలక్షన్లే. ఈ యాప్ని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్, ఆ రాష్ట్రానికి సంబంధించిన ఐటీశాఖ తో కలిసి ఈ యాప్ ని రూపొందించారు.

ఈ మొబైల్ ఫోన్ ఎలక్షన్ విధానాన్ని iit డైరెక్టర్ రాజత్ మునా పరీక్షిస్తున్నారు. జిల్లాలో ఉండేటువంటి ప్రతి పౌరుడు ఈ ప్రక్రియలో ఓటు హక్కును వినియోగించుకోవాలి అంటూ తెలియజేస్తున్నారు. అంతేకాకుండా వికలాంగులు సీనియర్ సిటిజన్స్ కి ఇది బాగా ఉపయోగపడుతుంది అంటూ ఐఐటి నిపుణులు తెలియజేస్తున్నారు. ఇక ఈ విధానం నేను ఒక బ్లాక్ చైన్ టెక్నాలజీ ద్వారా వినియోగించనున్నారు అధికారులు.

ఈ యాప్ ను వినియోగించుకోవాలంటే ఖచ్చితంగా మూడు సార్లు తమ వేలిముద్రలను వేయాలి. ఒకసారి ఓటర్ పేరు, మరొకసారి ఆధార్, మరొకసారి లైవ్ లొకేషన్ వంటివి సింగర్ ప్రిన్స్ మ్యాచింగ్ సరి చూసుకోవాలి. ఇక ఇలాంటి యాప్ ద్వారా ఆన్ లైన్లో ఓటు వేసినట్లయితే అవి చెరిగిపోకుండా లెక్కించడానికి బాగా సహాయపడుతాయి. ఇక ఈ యాప్ ను ఉపయోగించిన వారు డేటా మొత్తం ఆ రాష్ట్రానికి సంబంధించిన డేటా సెంటర్ లో భద్రపరుస్తారు.

ఇలాంటివి ఎక్కువగా ఉపయోగించడం వల్ల తొందరగా ఫలితాలను తెలుసుకోవచ్చని ఐఐటి నిపుణులు తెలియజేస్తున్నారు. మొత్తం ప్రక్రియను ఒక వెబ్ పోర్టల్ ను ఉపయోగించి చెక్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇలాంటి వాటి వల్ల ఎటువంటి దొంగ ఓట్ల ముద్రణకు దోహద పడే అవకాశం ఉండదు అన్నట్లుగా ఐఐటీ బాంబే ప్రొఫెసర్లు తెలియజేశారు. ఇక ఇందులో ప్రొఫెసర్ రజత్ మునా, భారత ఎన్నికల కమిషనర్ సలహాదారుడు, ఢిల్లీకి చెందిన కొంత మంది ప్రొఫెసర్లు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.రాబోయే రోజుల్లో వీటినే ఎక్కువగా ఉపయోగించే అవకాశం ఉన్నట్లుగా తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: